‘హోర్ముజ్’ మూసేయాలని ఇరాన్ నిర్ణయం.. ఆర్థిక ఆత్మహత్యేనన్న రుబియో!

by Phanindra |

హోర్ముజ్ జలసంధిని మూసేయాలని ఇరాన్ నిర్ణయించింది. ఇది ఆ దేశానికి ఆర్థిక ఆత్మహత్యే అని మార్కో రుబియో హెచ్చరించారు.

‘హోర్ముజ్’ మూసేయాలని ఇరాన్ నిర్ణయం.. ఆర్థిక ఆత్మహత్యేనన్న రుబియో!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్‌లోని న్యూక్లియర్ స్థావరాలపై యూఎస్ దాడులు చేయడాన్ని ఆ దేశం చాలా సీరియస్‌గా తీసుకుంది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఇరాన్.. తాజాగా ప్రపంచ ఆయిల్ సరఫరాకు కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ని మూసేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ఇరాన్ పార్లమెంటు ఆమోదం కూడా లభించడం గమనార్హం.


అయితే ఇలా చేయడం చాలా పెద్ద తప్పు అవుతుందని, ఈ విషయంలో చైనా జోక్యం చేసుకోవాలని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో అన్నారు. ‘ఆయిల్ కోసం హోర్ముజ్ జలసంధిపై చైనా బాగా ఆధారపడుతుంది. కాబట్టి ఆ దేశం ఇలా చేయొద్దని ఇరాన్‌ను హెచ్చరించాలి. ఒకవేళ ఇరాన్ కనుక ఈ జలసంధిని మూసేస్తే అది చాలా పెద్ద తప్పు అవుతుంది. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయి. అలాంటప్పుడు ఎలా స్పందించాలో మా చేతుల్లో ఉంటుంది’ అని రుబియో స్పష్టంచేశారు. అదే సమయంలో ఇరాన్‌కు కూడా అది ఆర్థికంగా ఆత్మహత్య అవుతుందని వార్నింగ్ ఇచ్చారు.

Next Story