- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Iran: ఆపరేషన్ సింధు.. ఇరాన్ నుంచి 827 మంది స్వదేశానికి
by B.Srinivas |
ఇరాన్ ఇజ్రాయెల్ వివాదం నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను ఆపరేషన్ సింధు పేరుతో ఇండియాకు రప్పిస్తున్న విషయం తెలిసిందే.

X
దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ ఇజ్రాయెల్ (Iran Israel) వివాదం నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను ఆపరేషన్ సింధు (Operation sindhu) పేరుతో ఇండియాకు రప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం నాటికి 827 మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 20న తరలింపు ప్రక్రియ ప్రారంభం అదే రోజు 290 మంది తిరిగొచ్చారు. అలాగే శనివారం తెల్లవారుజామున ఒక విమానం రాగా అందులో 227 మంది, సాయంత్రం మరో ప్లైట్ లో 310 మంది ఢిల్లీకి చేరుకున్నారు. వారందరికీ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ (Keerthi Vardhan singh) స్వాగతం పలికారు. ప్రయాణికులంతా స్వదేశానికి చేరుకోగానే వందేమాతరం, భారత్ మాతాకి జై నినాదాలు చేశారు.
Next Story






