- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్ యూటర్న్.. మళ్లీ హర్మూజ్ మూసివేత
ఇరాన్ మళ్లీ యూటర్న్ తీసుకుంది. హర్మూజ్ జలసంధిపై మనసు మార్చుకుంది. తొలుత హర్మూజ్ రాకపోకలను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది...

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్(Iran) మళ్లీ యూటర్న్ తీసుకుంది. హర్మూజ్ జలసంధి(Hormuz Strait)పై మనసు మార్చుకుంది. తొలుత హర్మూజ్ రాకపోకలను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే గంటల వ్యవధిలోనే హర్మూజ్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్ మిలిటరీ కమాండ్(Iran Military Command) స్వయంగా వెల్లడించారు. అమెరికా(America) హామీలను విస్మరించిందని, ఈ మేరకు హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇరాన్ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే షిప్పులను అమెరికా అడ్డుకుంటోందని, వెంటనే ఆ ప్రయత్నాలను నిలిపివేయాలని సూచించింది. అంతేకాదు తమ షిప్పులను అడ్డుకోవడం ఆగేంతవరకూ హర్మూజ్‌పై తమ నియంత్రణ కొనసాగుతోందని ఇరాన్ మిలిటరీ కమాండ్ హెచ్చరించింది.
రెండు దేశాల కొట్లాట నడుమ..
కాగా ఇరాన్-అమెరికా మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే సుదీర్ఘంగా జరుగుతున్న ఈ యుద్ధం వల్ల మిగిలిన దేశాలపై ఈ ప్రభావం తీవ్రంగా పడుతోంది. రెండు దేశాల ఆధిపత్య కొట్లాట నడుమ హర్మూజ్ జలమార్గాన్ని మూసివేయడంతో తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ మార్గం ద్వారా ఆయిల్, గ్యాస్, సరుకులు, ఇతర ఉత్పత్తులు షిప్పుల ద్వారా ఆయా దేశాలకు చేరుతుంటాయి. అయితే యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలమార్గాన్ని మూసివేయడంతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల విజ్ఞప్తితో హర్మూజ్ రాకపోకలను కొనసాగిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో ఆయా దేశాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే అమెరికా తీరుపై ఇరాన్ మండిపడింది. హర్మూజ్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ మార్గం ద్వారా ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతి చేసుకునే దేశాల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.






