- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భద్రత అందరికీ ఉండాలి.. లేదంటే ఎవరికీ వద్దు: అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. అమెరికా వైఖరిపై ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడుతూ సంచలన హెచ్చరికలు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. అమెరికా వైఖరిపై ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడుతూ సంచలన హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే చూస్తూ ఊరుకోబోమని, దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. పర్షియన్ గల్ఫ్ సముద్ర ప్రాంతంలో అమెరికా జోక్యం పెరిగితే, ఆ ప్రాంత భద్రత పూర్తిగా ప్రమాదంలో పడుతుందని ఇరాన్ స్పష్టం చేసింది. ఒకవేళ అమెరికా లేదా దాని మిత్రదేశాలు ఇరాన్ పోర్టులను దిగ్బంధిస్తే.. తాము కూడా గల్ఫ్ ప్రాంతంలోని కీలక పోర్టులను మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. దీనివల్ల ప్రపంచ చమురు రవాణాకు తీవ్ర ఆటంకం కలిగే అవకాశం ఉంది.
అందరికీ భద్రత.. లేదా ఎవరికీ వద్దు..
భద్రత అనేది ఉంటే అందరికీ ఉండాలి, లేకపోతే ఎవరికీ ఉండకూడదు అంటూ ఇరాన్ తన పట్టుదలను ప్రదర్శించింది. తమ ప్రయోజనాలను దెబ్బతీస్తే, ఇతర దేశాల ప్రయోజనాలను కూడా దెబ్బతీస్తామని పరోక్షంగా హెచ్చరించింది. పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైనవి. ఇరాన్ ఈ ప్రాంతంలో పోర్టులను మూసివేస్తామని చేసిన హెచ్చరికలు అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.






