Iran: ఇరాన్ అణ్వాయుధాల తయారీ.. ఇజ్రాయెల్ అమెరికా మధ్య భిన్నాభిప్రాయాలు

by B.Srinivas |

ఇరాన్ అణ్వాయుధాల తయారీ విషయంలో ఇజ్రాయెల్, అమెరికాల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి.

Iran: ఇరాన్ అణ్వాయుధాల తయారీ.. ఇజ్రాయెల్ అమెరికా మధ్య భిన్నాభిప్రాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ అణ్వాయుధాల తయారీ విషయంలో ఇజ్రాయెల్, అమెరికాల (Israel America) మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ విషయంలో ఇజ్రాయెల్ వాదనకు భిన్నంగా యూఎస్ ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసేందుకు వేగంగా పావులు కదుపుతోందని, కొన్ని నెలల్లోనే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే సామర్థ్యం ఆ దేశానికి ఉందని ఇజ్రాయెల్ ఇటీవల వాదించింది. అయితే దీనికి విరుద్ధంగా యూఎస్ ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది. ఇరాన్ అణ్వాయుధాల తయారీలో ఆక్టివ్ గా లేదని, అణ్వాయుధాలు ఉత్పత్తి చేయడానికి మూడేళ్లు పట్టొచ్చని తెలిపింది. అంతేగాక ఇరాన్ అణ్వాయుధాలను డెవలప్ చేయడానికి తుది నిర్ణయం తీసుకోలేదని, దాని కోసం ప్రయత్నం కూడా చేయలేదని యూఎస్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇరాన్ కార్యకలాపాలు ఆందోళనకరంగానే ఉన్నప్పటికీ వారు తయారు చేసే స్థితికి ఇంకా చేరుకోలేదని వెల్లడించారు.

ఇజ్రాయెల్ వాదనను గతంలో ఇరాన్ సైతం ఖండించింది. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణ వేల యూఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సంచలనంగా మారింది. మరోవైపు తన సొంత దేశ నిఘా సంస్థ వాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. ఎవరు ఏమి చెప్పినా నాకు అనవసరమని, ఇరాన్ అణు బాంబు తయారీకి చాలా దగ్గరగా ఉందని నేను భావిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఇరాన్ తొమ్మిది అణు బాంబులను తయారు చేయడానికి తగినంత యురేనియంను సేకరించిందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) హెచ్చరించింది.

Next Story