- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Iran: ఇరాన్ త్వరలోనే అణు కార్యక్రమాన్ని ప్రారంభించొచ్చు.. ఐఏఈఏ చీఫ్ రాఫెల్ గ్రాస్సీ
ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని కొన్నినెలల్లోనే తిరిగి ప్రారంభించొచ్చని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ చీఫ్ గ్రాస్సీ అంచనా వేశారు.

దిశ, నేషన్ బూరో: ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని కొన్ని నెలల్లోనే తిరిగి ప్రారంభించొచ్చని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) చీఫ్ రాఫెల్ గ్రాస్సీ (Raffale Grassy) అంచనా వేశారు. త్వరలోనే స్వచ్చమైన యురేనియంను ఉత్పత్తి చేయొచ్చని తెలిపారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయడానికి అమెరికా చేసిన దాడులపై సందేహాలు తలెత్తుతున్నాయన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. ఇరాన్ వద్ద శుద్ది చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయని, ఇది అణు బాంబును తయారు చేయడానికి సరిపోతుందని తెలిపారు. అయితే అమెరికా దాడులకు ముందే ఈ నిల్వలను తొలగించారా లేదా ధ్వంసమైందా అనేది తెలియాల్సి ఉందన్నారు. అణు కేంద్రాల సామర్థ్యాలు అలాగే ఉన్నాయని, అవి కొన్ని నెలల్లోనే సుసంపన్నమైన యురేనియంను ఉత్పత్తి చేయగలవని చెప్పారు. యూఎస్ దాడుల్లో ప్రతిదీ ధ్వంసమైందని, అక్కడ ఏమీ లేదని ఎవరూ చెప్పలేరన్నారు. దాడుల్లో భాగంగా కొన్ని ధ్వంసమై ఉండొచ్చని, మరికొన్ని తరలించొచ్చని అభిప్రాయపడ్డారు. అణు సాంకేతిక పరంగా ఇరాన్ చాలా అధునాతన దేశమని అభివర్ణించారు. అయితే ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లోని సైట్‌లపై జరిగిన దాడులు యురేనియంను మార్చే, సుసంపన్నం చేసే ఇరాన్ సామర్థ్యాన్ని తగ్గించాయన్నారు.






