- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Iran: అమెరికా దాడులతో అణు కేంద్రాలకు నష్టం.. అంగీకరించిన ఇరాన్
అమెరికా దాడుల్లో తమ అణు కేంద్రాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయని ఇరాన్ తొలిసారి అంగీకరించింది.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా దాడుల్లో తమ అణు కేంద్రాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయని ఇరాన్ తొలిసారి అంగీకరించింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘీ (Esmail Baghaei) ఈ విషయాన్ని వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యూఎస్ దాడుల్లో అణు కేంద్రాలు దెబ్బతిన్నాయని తెలిపారు. బస్టర్ బాంబుల దాడులు ప్రభావవంతంగా ఉన్నాయని దీంతో నష్టం వాటిల్లిందని చెప్పారు. అయితే ఎంత మేర నష్టం వాటిల్లింది, దాడికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. మరోవైపు ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి సయీద్ ఖతీబ్జాదే మాట్లాడుతూ ఇరాన్ అణు కేంద్రాలకు జరిగిన నష్టానికి గాను అమెరికా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. కాగా, ఇరాన్ లోని నటాంజ్ (Natanz), ఫోర్డో (Fordow), ఇస్ఫహాన్ (Isfahan) లపై అమెరికా బంకర్-బస్టర్ బాంబులను ప్రయోగించిన విషయం తెలిసిందే.
భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఇరాన్
ఇజ్రాయెల్, అమెరికా దాడుల సమయంలో తమకు మద్దతు ఇచ్చినందుకు గాను భారత్ కు ఇరాన్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘భారతీయులు స్వేచ్ఛను ప్రేమించే ప్రజలు. ఘర్షణ సమయంలో తమకు మద్దతు తెలిపిన భారత పౌరులు, రాజకీయ పార్టీలు, ఎంపీలు, సామాజిక సంస్థలు, మత పెద్దలు, జర్నలిస్టులకు ధన్యవాదాలు. వారంతా ఇరాన్ వైపు దృఢంగా నిలబడ్డారు’ అని పేర్కొంది. సైనిక వివాదంలో తామే విజయం సాధించామని తెలిపింది. ఇరాన్ ఎల్లప్పుడూ శాంతి వైపే ఉంటుందని పేర్కొంది.






