- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Iran: యూఎస్ దాడులతో ఇరాన్‌కు భారీ నష్టం !
ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ప్రవేశించింది. మూడు కీలక అణు కేంద్రాలైన నటాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ సెంటర్స్‌పై దాడి చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: భీకరంగా జరుగుతున్న ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ప్రవేశించింది. ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలైన నటాంజ్ (Natanj), ఫోర్డో (Fordow), ఇస్ఫహాన్ (Isfahan) సెంటర్స్‌పై దాడి చేసింది. వాటిపై బస్టర్ బాంబులను ప్రయోగించింది. ఈ దాడిలో మూడు న్యూక్లియర్ సెంటర్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయని అమెరికా చెబుతుండగా, దాని ప్రభావం ఎక్కువగా లేదని ఇరాన్ వాదిస్తోంది. అయితే కీలకమైన అణు కేంద్రాలు ధ్వంసమైతే అణు బాంబును తయారు చేయాలనే ఇరాన్ ప్రయత్నం చెదిరినట్టేనని నిపుణులు భావిస్తున్నారు. చాలా ఏళ్ల వరకు ఇరాన్ అణు బాంబు తయారు చేయలేదని అంచనా వేస్తు్న్నారు. ఎందుకంటే ఈ మూడు కీలక అణు కేంద్రాలు ఇరాన్ అణు కార్యక్రమానికి వెన్నెముకగా పరిగణించేవారు. ఈ నేపథ్యంలో కీలకమైన నటాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ అణు కేంద్రాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అతిపెద్ద యురేనియం కేంద్రం ‘నటాంజ్’
నటాంజ్ అణు కేంద్రం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు దక్షిణంగా 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఇరాన్‌లోనే అతిపెద్ద యురేనియం సుసంపన్న కేంద్రంగా పరిగణించబడుతోంది. 2003 నుంచి ఈ కేంద్రం యాక్టివ్‌గా పరిగణిస్తుండగా యురేనియంను అణు ఇంధనంగా మార్చే కీలక సాంకేతికతతో పని చేస్తుంది. అంతేగాక భారీగా సెంట్రిఫ్యూజ్ యూనిట్లను నిర్వహిస్తోంది. యురేనియం సుసంపన్నం కోసం సెంట్రిఫ్యూజ్‌లను అభివృద్ధి చేయడానికి, అసెంబుల్ చేయడానికి దీనిని ఉపయోగిస్తారని తెలుస్తోంది. నటాంజ్ అణు కేంద్రంలో భూమి పైన 6 భవనాలు, మూడు భూగర్భ భవనాలు ఉన్నాయి. వాటిలో 50,000 సెంట్రిఫ్యూజ్ లను నిల్వ చేయగలదు. అందుకే దీనిని అమెరికా టార్గెట్ చేసిందని భావిస్తున్నారు.
ఫోర్డో అణు కేంద్రం
ఫోర్డో అణు కేంద్రం ఇరాన్‌లో అత్యంత సురక్షితమైన ప్రదేశంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఫోర్డో ఇరాన్ పవిత్ర నగరమైన కోమ్ సమీపంలో ఉండగా దాని నిర్మాణం చాలా రహస్యంగా, ఎంతో బలంగా ఉన్నట్టు ఇజ్రాయెల్ నిఘా సంస్థలు అంచనా వేశాయి. ఫోర్డో కేంద్రం యురేనియంను చాలా వేగంగా సుసంపన్నం చేయగలదు. ఇక్కడ అందుబాటులో ఉన్న 60శాతం సుసంపన్నమైన యురేనియంను కేవలం మూడు వారాల్లోనే 233 కిలోగ్రాముల ఆయుధ-గ్రేడ్ యురేనియంగా మార్చొచ్చు. ఇది ఇరాన్ సుమారు 9 అణు బాంబులను తయారు చేయగలిగేది. ఫోర్డో వద్ద దాదాపు 2,700 క్రియాశీల సెంట్రిఫ్యూజ్‌లను కలిగి ఉంది. దీంతో ఈ కేంద్రం ఇరాన్ అణు అభివృద్ధికి కీలకంగా మారింది. ప్రస్తుత అమెరికా దాడిలో ఇది ధ్వంసమైతే ఇరాన్ కు భారీ దెబ్బేనని విశ్లేషకుల అంచనా. అయితే 80 నుంచి 90 మీటర్ల లోతులో ఒక కొండ లోపల ఉండటం ఫోర్డో అణు కేంద్రం ప్రత్యేకత. కాబట్టి బాహ్య దాడుల ద్వారా దానిని నాశనం చేయడం చాలా కష్టం. అంత లోతుగా దాడి చేయడానికి అవసరమైన బాంబు ఉన్న ఏకైక దేశం అమెరికా అని ఇజ్రాయెల్ అధికారులు గతంలో తెలిపారు. ఈ క్రమంలోనే పోర్జో అణు కేంద్రంపై యూఎస్ GBU-57 మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ బాంబును ప్రయోగించినట్టు పలు కథనాలు వెల్లడించాయి.
ఆధునిక అణు శాస్త్ర కేంద్రం ‘ఇస్పహాన్’
అమెరికా టార్గె్ట్ చేసిన మరో కీలక అణు కేంద్రం ఇస్పహాన్. దేశంలోనే అతిపెద్ద అణు పరిశోధన సముదాయానికి నిలయంగా ఉంది. ఇరాన్ దీనిని 1984లో చైరా సహాయంతో నిర్మించింది. సుమారు 3000 మంది అణు శాస్త్ర వేత్తలు ఇస్పహాన్ అణు కేంద్రంలో పని చేస్తున్నారు. ఇరాన్ అణు ప్రోగ్రామ్‌కు దీనిని ప్రత్యేక కేంద్రంగా పరిగణిస్తున్నారు. ఈ ప్లాంట్‌లో గ్యాస్ మార్పిడి, ఇంధన రాడ్లు, అణు రియాక్టర్ వినియోగానికి యురేనియంను తయారు చేయగలదు. ఈ కేంద్రం ప్రధానంగా శాస్త్రీయ పరిశోధనలకు ప్రసిద్ధి చెందినప్పటికీ, ఇక్కడి మౌలిక సదుపాయాలు ఎప్పుడైనా సైనిక వినియోగానికి అనుకూలంగా మారొచ్చని అంచనాలున్నాయి. అందుకే దీనిని కూడా అమెరికా లక్ష్యంగా చేసుకుంది.
యూఎస్ దాడులతో తీవ్ర పరిణామాలు !
ఈ మూడు అణు కేంద్రాలను ధ్వంసం చేయడంతో 25 నుంచి 30 ఏళ్లుగా కొనసాగుతున్న ఇరాన్ అణు కార్యక్రమం దాదాపు ముగిసినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మూడు అణు కేంద్రాలను నిర్మించడానికి, అణు బాంబును తయారు చేయడానికి అరుదైన పదార్థాలను సేకరించడానికి ఇరాన్ ఎన్నో ఎళ్లుగా శ్రమించినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పుడు వాటిని నాశనం చేయడంతో ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బ తాకినట్టేనని, అయితే ఈ దాడి తీవ్ర పరిణామాలను కలిగించే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తు్న్నారు.






