- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇకపై వీసా ఫ్రీ ఎంట్రీ లేదు.. భారతీయులకు ఇరాన్ షాక్
ఇకపై భారతీయులకు తమ దేశంలోకి వీసా ఫ్రీ ఎంట్రీ లేదని ఇరాన్ ప్రకటించింది. నవంబరు 22 నుంచి కొత్త

దిశ, నేషనల్ బ్యూరో: భారతీయ పౌరులు ఇకపై వీసా లేకుండా తమ దేశంలోకి రావడానికి వీల్లేదని ఇరాన్ ప్రకటించింది. నవంబరు 22 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇంతకాలం వీసా లేకపోయినా భారతీయులు ఇరాన్‌లో ప్రవేశించే వీలుండేది. అయితే ఇకపై తమ దేశంలో ప్రవేశించాలన్నా, తమ ఎయిర్‌పోర్టులకు కీలకమైన ట్రాన్సిషన్ పాయింట్లుగా ఉపయోగించుకోవాలన్నా వీసా తప్పనిసరి అని ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. వీసా ఫ్రీ ఎంట్రీ విధానాన్ని నేరగాళ్లు యూజ్ చేసుకుంటున్నారని, అందుకే కొత్త నిబంధనలు తెచ్చామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎవరైనా సరే ఇరాన్‌కు వీసా లేకుండా ప్రవేశం కల్పిస్తామని, లేదా ట్రాన్సిట్ సౌర్యం కల్పిస్తామని హామీ ఇస్తే నమ్మొద్దని భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది. ఉద్యోగం చూపిస్తామని మోసాలు జరుగుతున్నాయని, కిడ్నాపింగ్స్ కూడా జరుగుతున్నాయని తెలిపిన విదేశాంగ శాఖ.. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.






