కువైట్‌లోని అమెరికా ఎయిర‌బేస్‌పై ఇరాన్ దాడి

by Gantepaka Srikanth |

కువైట్‌లోని అమెరికా ఎయిర‌బేస్‌పై ఇరాన్ దాడికి పాల్పడింది. డ్రోన్లతో విరుచుకుపడింది.

కువైట్‌లోని అమెరికా ఎయిర‌బేస్‌పై ఇరాన్ దాడి
X

దిశ, వెబ్‌డెస్క్:‌ కువైట్‌లోని అమెరికా ఎయిర‌బేస్‌పై ఇరాన్ దాడికి పాల్పడింది. డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతోపాటు హర్బూజ్‌ సమీపంలో మూడు ఆయిల్ ట్యాంకర్లపై దాడులు చేసింది. ఇప్పటికే జలసంధి మూసివేయంతో దాదాపు 150 ట్యాంకర్లు నిలిచిపోయాయి. ఇరాన్ దాడుల కారణంగా కువైట్, బహ్రెయిన్, మరియు యూఏఈ దేశాల్లో ఎయిర్ రైడ్ సైరన్లు నిరంతరాయంగా మోగుతున్నాయి. ఆకాశ మార్గంలో ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అరబ్ మరియు ఇరాన్ మీడియా ప్రతినిధులు అక్కడి ఉద్రిక్త పరిస్థితులను ఎప్పటికప్పుడు నివేదిస్తున్నారు. కేవలం అమెరికా స్థావరాలే కాకుండా, ఇటు ఆక్రమిత భూభాగాల్లోని ప్రధాన నగరాలైన టెల్ అవీవ్, అల్-ఖుద్స్ (జెరూసలేం), మరియు బీర్ షెవా నగరాల్లో కూడా భారీ పేలుళ్లు సంభవించినట్లు వార్తలు అందుతున్నాయి. మరోవైపు ఇరాన్‌పై నిర్విరామంగా అమెరికా యుద్ధం చేస్తూనే ఉంది. తాజా దాడులతో మధ్యప్రాచ్యంలో పరిస్థితి మరింత విషమంగా మారింది.

Next Story