- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: యుద్ధానికి ముగింపు.. కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్
ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇరాన్ కాల్పుల విరమణను ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇరాన్ కాల్పుల విరమణను ప్రకటించింది. 12 రోజులుగా కొనసాగుతున్న యుద్ధం ముగిసింది అంటూ ఇరాన్ అధికారిక ఛానల్ ప్రకటన చేసింది. అయితే ఈ ప్రకటన చేసే చివరి నిమిషం వరకు కూడా ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడులను ఆపకపోవడం ఆశ్చర్యకరం. కొద్దిసేపటి క్రితమే టెల్ అవీవ్‌పై టెహ్రాన్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు మరణించగా పదిమందికి పైగా గాయపడ్డారు. ఈ దాడి అనంతరం ఇరాన్ ప్రకటన చేసింది.
ఇక ఇరాన్ ప్రకటన కంటే ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఒప్పందానికి తానే మధ్య వర్తిత్వం వహించినట్టు చెప్పుకున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు దేశాలు శాంతి అంటూ కాళ్ల బేరానికి వచ్చాయన్నారు. అక్కడ శాంతి అవసరం ఉందని తాను గుర్తించినట్టు తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందంలో పశ్చిమాసియాతో పాటు ప్రపంచం కూడా నిజమైన విజయం సాధించిందని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాలు భవిష్యత్‌లో ప్రేమ, శాంతిని చూస్తాయన్నారు. అయితే ట్రంప్ ప్రకటనను ఇరాన్ విదేశాంగమంత్రి తోసిపుచ్చినా ఆ తరవాత కొద్దిసేపటికి కాల్పుల విరమణను ఆ దేశం ప్రకటించింది.
Read More..






