ఐపీఎస్ అధికారి ఆత్మహత్య.. కుల వేధింపులే కారణమా..? ఆస్తి విషయంలో ఎందుకా నిర్ణయం? సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు

by Sujitha Rachapalli |

హర్యానా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వై పూరణ్ కుమార్ ఆత్మహత్య సంచలనం సృష్టించింది. చండీగఢ్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకోగా.. తొమ్మిది పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇందులో వీలునామాను

ఐపీఎస్ అధికారి ఆత్మహత్య.. కుల వేధింపులే కారణమా..? ఆస్తి విషయంలో ఎందుకా నిర్ణయం? సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్ : హర్యానా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వై పూరణ్ కుమార్ ఆత్మహత్య సంచలనం సృష్టించింది. చండీగఢ్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకోగా.. తొమ్మిది పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇందులో వీలునామాను కూడా పేర్కొనగా ఆస్తి మొత్తాన్ని తన భార్య, ఐఏఎస్ అధికారి అమ్నీత్ కుమార్ పేరున రాసినట్లు తెలిపాడు.

ఇక తన ఆత్మహత్యకు కుల వేధింపులు, బహిరంగ అవమానాలు, మానసిక వేధింపులు కారణమని పలువురి పేర్లు ప్రస్తావించాడు పూరణ్ కుమార్. డీజీపీ శత్రుజిత్ సింగ్ కపూర్, ఎస్పీ నరేంద్ర బిజరానియా మానసికంగా హింసించారని ఇప్పటికే పూరన్ భార్య ఆరోపించగా.. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సమయంలో సూసైడ్ నోట్‌లోనూ ఇలాంటి విషయాలనే ప్రస్తావించాడు పూరణ్ కుమార్. హర్యానాకు చెందిన సీనియర్ అధికారులు 2020 నుంచి కుల వివక్ష చూపుతున్నారని, కులం ఆధారంగా హింసిస్తున్నారని, భరించలేకపోతున్నానని తెలిపాడు. తన చేసిన అభ్యర్థనలు, ఫిర్యాదులు హర్యానా కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారిగా హక్కులు ఉన్నాయని.. కానీ ప్రతీ విషయంలోనూ అవమానమే ఎదురైందని చెప్పుకొచ్చాడు. సెలవులు ఆమోదించడం, వాహనాల కేటాయింపు, అధికార వసతి వరకు అన్ని చోట్ల అభ్యర్థనలు, ఫిర్యాదులను పరిష్కరించే బదులు ప్రతీకారం తీర్చుకునేందుకు వినియోగించారని తెలిపాడు.

అంతేకాదు తనపై అనేక రకాల ఫిర్యాదులు చేస్తున్నారని, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పాడు. సీనియర్స్ బహిరంగంగా అవమానించారని.. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఏ అవకాశాన్ని వదిలిపెట్టట్లేదని అన్నాడు. పదిహేను మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారని.. తన బ్యాచ్ మేట్ మనోజ్ యాదవ్ పికె ఆగర్వాల్, టీవీఎస్ఎన్ ప్రసాద్ మానసికంగా వేధించారని.. అప్పటి హోం మంత్రికి లిఖిత పూర్వక ఫిర్యాదు చేసిన సరైన చర్యలు తీసుకోలేదన్నాడు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనురాగ్ రస్తోగికి విషయాన్ని క్లియర్‌గా వివరించినా కొట్టి పారేశారని అన్నాడు. ఐపీఎస్ అధికారులు కుల్విందర్ సింగ్, మాతా రవికిరణ్ తనపై అభ్యంతరకరమైన భాషను ఉపయోగించారని.. ఇది తన ఆత్మహత్యకు ప్రధాన కారణమని ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు.

Next Story