బెంగళూరు ఈవెంట్‌ గురించి మాకు తెలియదు.. తొక్కిసలాట ఘటనపై IPL చైర్మన్ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధమాల్ కీలక ప్రకటన చేశారు.

బెంగళూరు ఈవెంట్‌ గురించి మాకు తెలియదు.. తొక్కిసలాట ఘటనపై IPL చైర్మన్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరులోని చిన్నస్వామి మైదానం(Chinnaswamy Stadium)లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధమాల్(Arun Dhumal) కీలక ప్రకటన చేశారు. బెంగళూరు ఈవెంట్‌కు గురించి మాకు తెలియదు.. సమాచారం కూడా లేదు. ఈ కార్యక్రమాన్ని తామే నిర్వహించలేదని స్పష్టం చేశారు. తొక్కిసలాట జరిగిన తర్వాత ఆర్సీబీ యాజమాన్యంతో మాట్లాడాం. పరిస్థితి ఏంటో తెలుసుకున్నాం. 10 మంది వరకు అభిమానులు మృతిచెందడం దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు జరగాలని ఎవరూ కోరుకోరు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అని అరుణ్ ధమాల్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) విజయోత్సవ కార్యక్రమం సందర్భంగా చిన్నస్వామి మైదానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆర్సీబీ జట్టు సన్మాన కార్యక్రమానికి వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. స్టేడియం గేట్లు బద్దలు కొట్టుకుంటూ స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, 50 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌.. ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.

Next Story