- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2026: రోహిత్ శర్మ అభిమానులకు బ్యాడ్ న్యూస్
వాంఖడే మైదానం వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు స్వల్ప గాయమైన(తొడ కండరాల గాయం) విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: వాంఖడే మైదానం వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు స్వల్ప గాయమైన(తొడ కండరాల గాయం) విషయం తెలిసిందే. దీంతో ఆయన మధ్యలోనే రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. ఆ తర్వాత ఈ బ్యాటర్ తిరిగి బ్యాటింగ్‌కు రాలేదు. ఈ మ్యాచ్‌లో ముంబయి 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 137 రన్స్ చేశాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 78 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 16న వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొడ కండరాల గాయానికి సంబంధించిన స్కానింగ్ చేయించుకుంటాడని తెలుస్తోంది. రిపోర్టుల్లో గాయం తీవ్రమైనదని తేలితే పంజాబ్‌తో మ్యాచ్‌కు హిట్‌మ్యాన్ అందుబాటులో ఉండకపోవచ్చని వార్తలొస్తున్నాయి. రోహిత్ గాయంపై ముంబయి ఇండియన్స్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.






