Intruder: జమ్మూలో పాక్ చొరబాటుదారుడు హతం.. వెల్లడించిన బీఎస్ఎఫ్

by B.Srinivas |

జమ్మూ కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహ్దు వద్ద పాకిస్థాన్ చొరబాటుదారుడిని బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సైనికులు హతమార్చారు.

Intruder: జమ్మూలో పాక్ చొరబాటుదారుడు హతం.. వెల్లడించిన బీఎస్ఎఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌ (Jammu Kashmir) లోని అంతర్జాతీయ సరిహ్దు వద్ద పాకిస్థాన్ చొరబాటుదారుడిని బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ (BSF) సైనికులు హతమార్చారు. ఆర్ఎస్ పురా (Rs pura) సెక్టార్‌లోని సరిహద్దు అవుట్ పోస్ట్ అబ్దు్ల్లియన్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున బీఎస్ఎఫ్ బలగాలు అనుమానాస్పద కదలికలను గమనించాయి. ఓ వ్యక్తి అంతర్జాతీయ సరిహద్దును దాటుతున్నట్టు గుర్తించాయి. దీంతో అతనికి పలు మార్లు సూచించాయి. కానీ భారత సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే సైనికులు కాల్పులు జరపగా పాక్ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలం నుంచి మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి. మృతుడి వయసు 35 సంవత్సరాలు ఉంటుందని, ఆయన వద్ద ఎలాంటి పత్రాలు లభ్యం కాలేదని తెలిపాయి.

ఈ ఘటన అనంతరం పాకిస్థాన్ రేంజర్స్, బీఎస్ఎఫ్ జవాన్లు ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. చొరబాటు ప్రయత్నంపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అలాగే చొరబాటుదారుడి మృత దేహాన్ని స్వీకరించడానికి సైతం పాక్ నిరారించినట్టు సమాచారం. అంతకుముందు ఏప్రిల్ 1న జమ్మూ కశ్మీర్‌లోని ఎల్‌ఓసీ వద్ద ఐదుగురు పాక్ చొరబాటుదారులను సైన్యం హతమార్చింది. పూంచ్‌లోని ఎల్‌ఓసీలోని కృష్ణ ఘాటి సెక్టార్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీంతో వరుసగా చొరబాటు ప్రయత్నాలు జరుగుతుండటంతో అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Next Story