హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

by Malleboina Mahesh |   (  Updated:2025-12-09 06:12:31  IST  )

ఓ గ్రామంలో తల లేని మృతదేహం లభ్యం కావడంతో రెండు గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ షాకింగ్ ఘటన ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో చోటు చేసుకుంది.

హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
X

దిశ, వెబ్ డెస్క్: ఓ గ్రామంలో తల లేని మృతదేహం (A headless corpse) లభ్యం కావడంతో రెండు గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ షాకింగ్ ఘటన ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో చోటు చేసుకుంది. తల లేని మృతదేహం లభ్యం కావడంతో రెండు గ్రామాలకు చెందిన ప్రజల మధ్య ఘర్షణలు చెలరేగి, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. "సామాజిక వ్యతిరేక శక్తులు" WhatsApp, Facebook, X వంటి మాధ్యమాలను ఉపయోగించి రెచ్చగొట్టే, అభ్యంతరకరమైన సందేశాలను వ్యాప్తి చేయడంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చిందని, ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని హోం శాఖ నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో, తదుపరి ఉద్రిక్తతలను నివారించేందుకు డిసెంబర్ 8వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్ 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్, సోషల్ మీడియా సేవలను పూర్తిగా నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

పబ్లిక్ ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వానికి విస్తృత అధికారాలను కల్పించే టెలికమ్యూనికేషన్స్ యాక్ట్, 2023లోని సెక్షన్ 20 నిబంధనల కింద ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఈ నిషేధం కింద WhatsApp, Facebook, Instagram, X వంటి అన్ని సోషల్ మీడియా సేవలతో పాటు మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ సేవలు కూడా నిలిపివేయబడ్డాయి. అయితే, మల్కన్‌గిరి కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం, ఆసుపత్రులు వంటి కీలక పరిపాలన కార్యాలయాల యొక్క ముఖ్యమైన టెలిఫోన్ లైన్లకు మాత్రమే మినహాయింపు ఇవ్వబడింది. తదుపరి హింస జరగకుండా, శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి ప్రభావిత ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు.

Read More.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఎఫెక్ట్.. నానక్‌రాంగూడలో భారీగా ట్రాఫిక్ జామ్

Next Story