International Yoga Day : రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం.. 191 దేశాల్లో ప్రత్యేక కార్యక్రమాలు

by Muthe.Rajitha |

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day) ప్రపంచం అంతా సెలెబ్రేట్ చేసుకోబోతోంది.

International Yoga Day : రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం.. 191 దేశాల్లో ప్రత్యేక కార్యక్రమాలు
X

దిశ, వెబ్ డెస్క్ : జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day) ప్రపంచం అంతా సెలెబ్రేట్ చేసుకోబోతోంది. రేపటి ఇంటర్నేషనల్ యోగా డే పురస్కరించుకొని 191 దేశాల్లో వివిధ ప్రత్యేక కార్యక్రమాలు(Yoga Events) చేపట్టనున్నారు. యోగా విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు గాను 191 దేశాల్లోని 1300 నగరాల్లో 2000 వేలకు పైగా యోగా ఈవెంట్లు జరగనున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవ 10వ వార్షికోత్సవ సందర్బంగా ప్రతి దేశంలోనూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 15 దేశాలకు చెందిన 17 మంది ప్రముఖ యోగా గురువులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు. కాగా భారత్ దాయాది దేశం అయిన పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్(Islamabad) లో కూడా ఈ ఈవెంట్ నిర్వహించనున్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్(ICCR) పేర్కొంది.

Next Story