- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
FBI: ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ డ్రగ్ లార్డ్ పట్టివేత
ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ లార్డ్ పంజాబ్ లో పట్టుబడ్డాడు. అమెరికా సహా పలు దేశాలకు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ఇంటర్నేషనల్ డ్రగ్ డీలర్‌ను పంజాబ్ పోలీసులు (Punjab Police) పట్టుకున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ లార్డ్ పంజాబ్ లో పట్టుబడ్డాడు. అమెరికా సహా పలు దేశాలకు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ఇంటర్నేషనల్ డ్రగ్ డీలర్‌ను పంజాబ్ పోలీసులు (Punjab Police) పట్టుకున్నారు. ఇంటర్నేషనల్ డ్రగ్ లార్డ్ (FBI Most Wanted Drug Lord)గా పేరుమోసిన షెహనాజ్ సింగ్ అలియాస్ షాన్ భిందెర్‌ను అరెస్టు చేసినట్లు పంజాబ్ డీజీపీ సోషల్ మీడయాలో ప్రకటించారు. అతడు నార్కోటిక్స్ సిండికేట్‌లో అతడు కీలకంగా వ్యవహరిస్తున్నాడని అధికారులు చెప్పుకొచ్చారు. కొలంబియా నుంచి అమెరికా, కెనడాలోకి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. షెహనాజ్ అక్రమాలపై ప్రత్యేక నిఘా పెట్టిన అమెరికా ఎఫ్‌బీఐ ఫిబ్రవరి 26న అతడి అనుచరులను అరెస్టు చేసింది. అయితే, వారినుంచి 391 కేజీల మెథంఫెటమైన్, 109 కేజీల కొకైన్ సహా నాలుగు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామాలతో షెహనాజ్ పారిపోయి భారత్ కు వచ్చేశాడు. దీనిపై నిఘా సమాచారం రావడంతో పంజాబ్ పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ చేపట్టి.. అతడి జాడను గుర్తించారు. పక్కా వ్యూహంతో అతడ్ని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని డీజీపీ వెల్లడించారు. డ్రగ్స్ స్మగ్లింగ్, నేరాల కట్టడికి తాము కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పేందుకు ఆ ఆపరేషన్ నిదర్శనమని పంజాబ్ పోలీసులు వెల్లడించారు. డ్రగ్ స్మగ్లర్లు, క్రిమినల్స్‌కు పంజాబ్ లో చోటు లేదని పోలీసులు చెప్పుకొచ్చారు.






