చైనాలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్

by Malleboina Mahesh |   (  Updated:2025-09-01 16:03:53  IST  )

భారత ప్రధాని నరేంద్ర మోడీ SCO శిఖరాగ్ర సమావేశం విజయవంతంగా ముగిసింది. అనంతరం ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.

చైనాలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ SCO శిఖరాగ్ర సమావేశం (SCO summit) విజయవంతంగా ముగిసింది. అనంతరం ప్రధాని మోడీ (Prime Minister Modi) ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. అందులో "చైనాలో ఉత్పాదక పర్యటనను ముగించుకుని, SCO శిఖరాగ్ర సమావేశానికి హాజరై, వివిధ ప్రపంచ నాయకులతో సంభాషించాను. కీలకమైన ప్రపంచ సమస్యలపై భారతదేశం యొక్క వైఖరిని కూడా నొక్కిచెప్పాను. ఈ శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు అధ్యక్షుడు జి జిన్‌పింగ్, చైనా ప్రభుత్వం ప్రజలకు ధన్యవాదాలు" తెలిపారు.

అంతకు ముందు 25వ శాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Modi) మాట్లాడుతూ.. ఉగ్రవాదం శాంతికి ముప్పుగా మారిందని, ఈ సమస్యతో భారత్ గత 4 దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతోందని తెలిపారు. SEO సభ్యులుగా భారత్ కీలక భూమిక పోషిస్తోందని అన్నారు. ఎస్‌‌సీవో కోసం భారత్ భద్రత, అసుసంధానం, అవకాశాలు అనే మూడు పిల్లర్లపై ఆధారపడి ఉందని తెలిపారు. రాజకీయ దుమారం రేపుతున్న ట్రంప్ సలహాదారు వ్యాఖ్యలు ఉగ్రవాదం, వేర్పాటువాదం సవాళ్లుగా మారాయని పేర్కొన్నారు. భారత అభివృద్ధిలో ఎస్‌సీవో దేశాలు భాగస్వా్మ్యం కావాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

Next Story