సీఎం అభ్యర్థి ప్రకటన వేళ డీకే శివకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Disha Web Desk 12 |
సీఎం అభ్యర్థి ప్రకటన వేళ డీకే శివకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో : కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, సీఎం అభ్యర్థి డీకే శివకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆదివారం తుంకూరులో మీడియాతో మాట్లాడుతూ..మాజీ సీఎం సిద్ధరామయ్యకు తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ‘సిద్ధరామయ్యతో విభేదాలు ఉన్నట్లు కొందరు అంటున్నారు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు’అని డీకే స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కోసం చాలాసార్లు తాను త్యాగాలు చేశానని కూడా చెప్పారు. ఎన్నిసార్లు త్యాగాలు చేసి సిద్ధరామయ్య వెన్నంటే ఉన్నానని, తనకు సహనమే లేకుంటే మొదట్లోనే తాను మంత్రిని అయ్యే వాడిని కాదని, సిద్ధరామయ్యకు సహకరించేవాడిని కానని చెప్పారు.

కాగా, కాంగ్రెస్ సీఎం ఎంపిక కోసం కీలకమైన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు జరగనుండటం, సీఎం రేసులో డీకే కూడా ఉండటంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కర్ణాటక సీఎం పదవి రేసులో సిద్ధరామయ్య ముందున్నారని, కాంగ్రెస్ అధిష్ఠానం సైతం ఆయనను సీఎం చేసేందుకు సానుకూలంగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. డీకే కష్టానికి తగినట్టుగా ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నట్టు చెబుతున్నారు.

Also Read..

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే

Next Story

Most Viewed