- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IB Chief: ఐబీ చీఫ్ తపన్ డేకా పదవీ కాలం ఏడాది పొడిగింపు
2008 ముంబయి 26/11 ఉగ్రవాద దాడుల సమయంలో కౌంటర్ ఆపరేషన్‌కు బాధ్యతలు నిర్వహించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ కుమార్ డేకా పదవీకాలాన్ని మరోసారి పొడిగిస్తూ మంగళవారం పర్సనల్ మినిస్ట్రీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీకాలాన్ని మరో ఏడాది వరకు పొడిగించేందుకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో తపన్ కుమార్ 2026, జూన్ వరకు లేదా తదుపరి ఊతర్వులు అందేవరకూ ఐబీ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. 1988 బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన తపన్ కుమార్, 2022, జూన్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఇదివరకు 2024లో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులను సమర్థవంతంగా పరిష్కరించిన కారణంగా ఆయన పదవిని ఒక సంవత్సరం పొడిగించారు. 20 ఏళ్ల పాటు ఐబీ ఆపరేషన్స్ విభాగానికి హెడ్‌గా వ్యవహరించిన ఆయన, 2008 ముంబయి 26/11 ఉగ్రవాద దాడుల సమయంలో కౌంటర్ ఆపరేషన్‌కు బాధ్యతలు నిర్వహించారు. ఉగ్రవాదాన్ని నిరోధించడంలో తపన్ కుమార్‌కు దశాబ్దాల అనుభవం ఉంది. ఇండియన్ ముజాహిదీన్ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహించే సమయంలో ఆయన ఆపరేషన్స్ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన హయాంలోనే ఐబీ ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన అందరినీ ట్రాక్ చేసింది. 2015–16 పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి, 2019 పుల్వామా దాడి సమయంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం, ముఖ్యంగా లోయ ప్రాంతంలో జరిగే హత్యలు వంటి కీలకమైన కేసులను కూడా చేపట్టారు.






