అరుదైన ఘనత సాధించిన మహిళా నేవీ అధికారులు

by Ajay Maddhiboyina |

దక్షిణ పసిఫిక్ లోని ఈ ప్రాంతాన్ని స్పెస్ క్రాఫ్ట్ సెమెట్రీగా పరిగణిస్తుంటారు.

అరుదైన ఘనత సాధించిన మహిళా నేవీ అధికారులు
X

- పాయింట్ నెమోను చేరుకున్న మొదటి భారత మహిళలు

దిశ, నేషనల్ బ్యూరో:

సముద్రయానం, మహిళా సాధికారతలో ఇండియన్ నేవీకి చెందిన ఇద్దరు అధికారిణులు అరుదైన ఘనత సాధించారు. భూమిపైన అత్యంత సుదూర ప్రాంతమైన పాయింట్ నెమోకు లెఫ్టినెంట్ కమాండర్లు కే.దిల్నా, ఏ.రూపా చేరుకోగలిగారు. ఐఎన్ఎస్‌వీ తరిణిలో ప్రయాణించిన వీరు జనవరి 30 అర్థరాత్రి 12.30 గంటల సమయంలో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. న్యూజీలాండ్‌లోని లిట్టెల్‌టన్ నుంచి ఫాక్లాండ్‌ దీవుల్లోని పోర్ట్ స్టాన్లీకి ప్రయాణిస్తున్న క్రమంలో వీరు పాయింట్ నెమో మీదుగా ప్రయాణించారు. నావికా సాగర్ పరిక్రమ 2 యాత్రలో భాగంగా వీరు ఈ సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నారు. దక్షిణ ధృవంలోని పాయింట్ నెమోకు చేరుకోవడం దాదాపు అసాధ్యంగా చెబుతుంటారు. ఇక్కడి నుంచి నేలను చేరుకోవాలంటే 2,688 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక దగ్గరలోని మనుషులంటే.. అంతరిక్షంలో తిరిగే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోని వ్యోమగాములే. అలాంటి ప్రాంతానికి భారత నేవీకి చెందిన మహిళలు చేరుకోవడం గర్వకారణంగా అధికారులు చెబుతున్నారు.

దక్షిణ పసిఫిక్ లోని ఈ ప్రాంతాన్ని స్పెస్ క్రాఫ్ట్ సెమెట్రీగా పరిగణిస్తుంటారు. అంతరిక్షంలో ఎక్స్‌పైరీ అయిన శాటిలైట్లు, ప్రయోగాల సమయంలో ఉపయోగించిన రాకెట్ల శకలాలను ఈ ప్రాంతంలోనే పడేలా చేస్తారు. భూమిపైకి వచ్చే శాటిలైట్ల కారణంగా మానవాళికి ఎలాంటి ముప్పు జరగకుండా ఈ పాయింట్ నెమో వైపుకు మళ్లిస్తుంటారు.

Next Story