అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సహా పలు ఈ-కామర్స్‌కు కేంద్రం నోటీసులు.. ఎందుకంటే?

by Naga Rani Yarlagadda |

భారత్ లో ప్రముఖంగా సేవలందిస్తోన్న ఈ-కామర్స్ వేదికలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సహా వివిధ సంస్థలు పాకిస్తాన్ కు చెందిన జెండాలను (Pak Flags in E-Commerce), ఆ దేశానికి చెందిన వస్తువులను ఆన్లైన్లో అమ్ముతున్నాయన్న ఆరోపణలపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (CCPA) తీవ్రంగా స్పందించింది.

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సహా పలు ఈ-కామర్స్‌కు కేంద్రం నోటీసులు.. ఎందుకంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ప్రముఖంగా సేవలందిస్తోన్న ఈ-కామర్స్ వేదికలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సహా వివిధ సంస్థలు పాకిస్తాన్ కు చెందిన జెండాలను (Pak Flags in E-Commerce), ఆ దేశానికి చెందిన వస్తువులను ఆన్లైన్లో అమ్ముతున్నాయన్న ఆరోపణలపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (CCPA) తీవ్రంగా స్పందించింది. ఈ-కామర్స్ చేస్తున్న ఈ పనులు జాతీయ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. వెంటనే వాటి ఉత్పత్తుల్ని ప్లాట్ ఫామ్ ల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అమెజాన్ ఇండియా (Amazon India), ఫ్లిప్ కార్ట్ (Flipkart), యూబై ఇండియా, ఎట్సీ, ది ఫ్లాగ్ కంపెనీ, ది ఫ్లాగ్ కార్పొరేషన్ వంటి ఈ-కామర్స్ సంస్థలకు సీసీపీఏ నోటీసులు పంపినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఒక ప్రకటన చేశారు.

పాక్ కు చెందిన జెండాలు, ఇతర వస్తువుల్ని ఈ-కామర్స్ వేదికగా విక్రయించడం దేశస్తుల మనోభావాల్ని దెబ్బతీయడమేనని అందులో పేర్కొన్నారు. ఇలాంటి సున్నితమైన విషయాలను సహించబోమని, ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్ వెంటనే వాటిని తొలగించి, జాతీయ చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.

Next Story