ఆరోగ్య శాఖలో కలకలం.. పిల్లల యాంటీబయాటిక్ సిరప్‌లో పురుగులు..

by Sujitha Rachapalli |

మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖలో కలకలం రేగింది. గ్వాలియర్‌లోని మురార్ జిల్లా ఆస్పత్రి పరిధిలోని ప్రసూతి గృహానికి.. ఓ మహిళ తన బిడ్డను చికిత్స కోసం తీసుకొచ్చింది. డాక్టర్ మెడికల్ సెంటర్‌ నుంచి అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ సిరప్‌ను ఆమెకు ఇవ్వగా..

ఆరోగ్య శాఖలో కలకలం.. పిల్లల యాంటీబయాటిక్ సిరప్‌లో పురుగులు..
X

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖలో కలకలం రేగింది. గ్వాలియర్‌లోని మురార్ జిల్లా ఆస్పత్రి పరిధిలోని ప్రసూతి గృహానికి.. ఓ మహిళ తన బిడ్డను చికిత్స కోసం తీసుకొచ్చింది. డాక్టర్ మెడికల్ సెంటర్‌ నుంచి అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ సిరప్‌ను ఆమెకు ఇవ్వగా.. దాన్ని ఓపెన్ చేయగా నల్ల పురుగులు కనిపించాయి. దీంతో సదరు మహిళ సివిల్ సర్జన్ డాక్టర్ ఆర్కే శర్మకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ఔషధ విభాగం.. సిరప్ పంపిణీని నిలిపివేసింది. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అనుభవి శర్మ నేతృత్వంలోని బృందం మెడిసిన్ స్టోర్‌కు చేరుకుని శాంపిల్‌ను దర్యాప్తు కోసం పంపించింది. ఇప్పటికే సరఫరా చేసిన సిరప్‌ను రీకాల్ ద్వారా సేకరించేందుకు నిర్ణయించారు. కాగా ఈ సిరప్ భోపాల్‌లోని గవర్నమెంట్ సెంటర్ నుంచి సప్లై చేయబడినట్లు తెలుస్తోంది.

Next Story