INS Mahe: నౌకాదళం చేతికి INS ‘మాహె’.. అట్టహాసంగా హ్యాండోవర్ సెర్మనీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-24 06:44:15  IST  )

భారత్‌లో తయారైన మొదటి యాంటీ-సబ్‌మెరైన్ యుద్ధనౌక ‘మాహె’ ఈ రోజు భారత నౌకాదళంలోకి చేరింది.

INS Mahe: నౌకాదళం చేతికి INS ‘మాహె’.. అట్టహాసంగా హ్యాండోవర్ సెర్మనీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో తయారైన మొదటి యాంటీ సబ్‌మెరైన్ యుద్ధ నౌక ‘మాహె’ (MAHE) ఇవాళ భారత నౌకాదళం (Indian Airforce)లోకి చేరింది. ముంబై నేవల్ డాక్‌యార్డ్‌లో జరిగిన హ్యాండోవర్ సెర్మనీలో భారత సైన్య అధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేదీ (Upendra Dwivedi), వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ (Krishna Swaminathan) పాల్గొని స్వయంగా నౌకను నౌకాదళానికి అంకితం చేశారు. అయితే, యాటీ సబ్‌మరైన్ ‘మాహె’ పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో నిర్మితమైంది. తక్కువ లోతు ఉన్న సముద్ర ప్రాంతాల్లో శత్రు సబ్‌మెరైన్‌లను గుర్తించి ధ్వంసం చేయడమే దీని స్పెషాలిటీ అని నేవీ అధికారులు వెల్లడించారు. అత్యాధునిక సోనార్ సెన్సార్లు ఈ నౌక సొంతం. శత్రు సబ్‌మెరైన్‌లను ఛేదించే టార్పెడోలు, రాకెట్ లాంచర్లు ఇంది సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. ‘ఆత్మనిర్భర్ భారత్‌‘కు ఇదో గొప్ప మైలురాయి అని నౌకాదళ అధికారులు తెలిపారు.

Next Story