- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు మార్గం కంటే చౌకగా! రైల్వేలో బల్క్ సిమెంట్ రవాణాలో వినూత్న మార్పులు
బల్క్ సిమెంట్ రవాణాను ప్రోత్సహించేందుకు భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన వినూత్న సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: బల్క్ సిమెంట్ రవాణాను ప్రోత్సహించేందుకు భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన వినూత్న సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ట్యాంక్ కంటైనర్ల ద్వారా సిమెంట్ రవాణా చేసేందుకు పలు ప్రముఖ సిమెంట్ కంపెనీలు ఇప్పుడు కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CONCOR)ను ఆశ్రయిస్తున్నాయి. రవాణా ఛార్జీల తగ్గింపు, మౌలిక సదుపాయాల కల్పనలో రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాలు ఈ మార్పుకు ప్రధాన కారణం అని అధికారులు చెబుతున్నారు.
కీలక సంస్కరణలు ఇవే..
GTKM ఛార్జీల తగ్గింపు.. గతంలో టన్ను కిలోమీటరుకు (GTKM) 90 పైసలుగా ఉన్న ఛార్జీని రైల్వే శాఖ 85 పైసలకు తగ్గించినట్లు అధికారులు తెలిపారు. ఖాళీ ట్యాంక్ కంటైనర్లు తిరిగి వచ్చేటప్పుడు ఇచ్చే ప్రత్యేక డిస్కౌంట్లు రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాయి. బల్క్ సిమెంట్ నిల్వ, నిర్వహణ కోసం కాంకర్ తన టెర్మినల్స్‌లో భారీ సిలోల (Silos) ఏర్పాటును సులభతరం చేస్తోందని రైల్వే వర్గాలు తెలిపాయి.
రోడ్డు మార్గం కంటే చౌకగా..
గతంలో రైల్వే శాఖ TEU (Twenty-foot Equivalent Unit) ప్రాతిపదికన ఛార్జీలు వసూలు చేసేది. దీనివల్ల సిమెంట్ కంపెనీలకు రవాణా ఖర్చు భారంగా మారి, రోడ్డు మార్గం పైనే ఎక్కువగా ఆధారపడేవి. అయితే ప్రస్తుత సంస్కరణలు రైలు రవాణాను రోడ్డు రవాణా కంటే అత్యంత పోటీదాయకమైనదిగా మార్చాయని అధికారులు చెబుతున్నారు. ఈ నూతన విధానం వల్ల సిమెంట్ పరిశ్రమకు ప్లాంట్ నుండి మార్కెట్‌కు రవాణా సామర్థ్యం పెరుగుతుంది. రవాణా ఖర్చు తగ్గడమే కాకుండా, కాలుష్యం తగ్గడం, ఇంధన పొదుపు, బస్తాల (Bagged cement) రవాణాతో పోలిస్తే వృధా కాకుండా నేరుగా వినియోగదారులకు చేరడం వంటి ప్రయోజనాలు చేకూరనున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భారతీయ రైల్వేలు, సిమెంట్ కంపెనీల మధ్య ఈ 'విన్-విన్' (Win-Win) విధానం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేస్తోందని కేంద్ర ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.






