- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెలసరిలో ఉన్నారో లేదో తెలుసుకోవడానికి విద్యార్థినులపై అమానుష చర్య
మహారాష్ట్ర (Maharashtra)లోని ఠాణె జిల్లాలో దారుణ అమానవీయ ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర (Maharashtra)లోని ఠాణె (Thane) జిల్లాలో ఓ ప్రైవేటు స్కూల్(Private School)లో దారుణమైన అమానవీయ ఘటన చోటుచేసుకుంది. స్కూల్ బాత్రూమ్‌లో నెలసరి (Periods) రక్తపు మరకలు కనిపించటంతో, స్కూల్ ప్రిన్సిపల్ తీసుకున్న చర్యలు అందరినీ షాక్‌కు గురి చేశాయి. విద్యార్థినుల గౌరవాన్ని తృణప్రాయంగా చూస్తూ, వారిపై ఆమానుషంగా ప్రవర్తించారు. మంగళవారం ఉదయం స్కూల్ పారిశుద్ధ్య సిబ్బంది టాయిలెట్‌ను శుభ్రం చేస్తుండగా నెలసరి రక్తపు మరకలు కనిపించాయి. వాటి ఫొటోలు తీసి స్కూల్ ప్రిన్సిపల్‌కు పంపించగా, ఆమె తీవ్రంగా ఆగ్రహించారు. వెంటనే 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాలికలందరినీ కన్వెన్షన్ హాల్‌కు పిలిపించి, ఆ ఫొటోలు చూపించారు.
తర్వాత, పీరియడ్స్‌లో ఉన్నవారు ఒక వైపు, లేనివారు మరో వైపుగా విడిపోవాలని ఆదేశించారు. అంతటితో సంతృప్తి చెందని ప్రిన్సిపల్, మహిళా అటెండెంట్‌ను పిలిపించి, పీరియడ్స్‌లో లేమని చెప్పిన విద్యార్థినుల్ని చెక్ చేయమని ఆదేశించారు. దాంతో ఆ మహిళ, బాలికలను వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి, వారి వ్యక్తిగత అవయవాలను టచ్ చేస్తూ నెలసరిలో ఉన్నారో లేదో తనిఖీ చేశారు. ఈ చర్య వల్ల విద్యార్థినులు తీవ్రమైన మానసిక వేదనకు లోనయ్యారు.
ఈ విషయాన్ని బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో, బుధవారం రోజున తల్లిదండ్రులు స్కూల్ ఎదుట నిరసన తెలిపారు. వెంటనే ఈ విషయం పోలీసులకు తెలియజేయగా, పోలీసులు స్కూల్ ప్రిన్సిపల్, ప్యూన్, నలుగురు టీచర్లు, ఇద్దరు ట్రస్టీలపై.. మొత్తం 8 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ప్రిన్సిపల్, ప్యూన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, మిగతా వారికి సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, హ్యూమన్ రైట్స్ సంస్థలు, మహిళా హక్కుల కోసం పోరాటం చేసే సంఘాలు తీవ్రంగా స్పందించాయి. ఈ అమానవీయ చర్యలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పాఠశాలల వాతావరణాన్ని కలుషితం చేస్తూ, బాలికల భద్రతపై అనుమానాలు కలిగిస్తున్నాయి. విద్యా ప్రాంగణాల్లో ఇటువంటి దారుణాలకు తావుండకూడదని సామాజికవేత్తలు పేర్కొంటున్నారు.






