Sharmishta Panoli: ఇన్‌ఫ్లుయెన్సర్‌ శర్మిష్ఠ పనౌలీకి ఊరట

by Shamantha N |

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌, లా స్టూడెంట్ శర్మిష్ఠ పనౌలీ(Sharmishta Panoli) (22)కి కలకత్తా హైకోర్టులో ఊరట దక్కింది. ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Sharmishta Panoli: ఇన్‌ఫ్లుయెన్సర్‌ శర్మిష్ఠ పనౌలీకి ఊరట
X

దిశ, నేషనల్ బ్యూరో: సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌, లా స్టూడెంట్ శర్మిష్ఠ పనౌలీ(Sharmishta Panoli) (22)కి కలకత్తా హైకోర్టులో ఊరట దక్కింది. ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై సోషల్ మీడియాలో చేసిన పోస్టులో ఒక వర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై శర్మిష్ఠ అరెస్టయ్యారు. కోల్‌కతాలోని ఆనందపుర్‌ ప్రాంతానికి చెందిన శర్మిష్ఠ పుణె న్యాయ విశ్వవిద్యాలయంలో నాలుగో సంవత్సరం చదువుతోంది. అయితే, రాజకీయాలపై తన అభిప్రాయాలను చెప్పడం ద్వారా శర్మిష్ఠ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సరుగా మారింది. భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై బాలీవుడ్‌ ప్రముఖుల మౌనాన్ని ప్రశ్నిస్తూ మే 14న పోస్టు చేసిన వీడియో తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన పోస్టులు, రీల్స్‌ తొలగించి ఆమె క్షమాపణలు కోరారు. శర్మిష్ఠను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే అని డిమాండ్లు పెరగడంతో పోలీసులు రంగంలోకి దిగి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆమె గురుగ్రామ్‌లో ఉన్నట్టు ట్రాక్‌ చేసి, శుక్రవారం అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు. గత శనివారం న్యాయస్థానం ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించగా.. ప్రస్తుతం జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. మే 31న ఆమెను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేయడంతో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది.

Next Story