మూడో టర్మ్‌లో ప్రధాని మోడీ చేయాల్సిన లిస్ట్: పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా

by S Gopi |

'వన్ నేషన్, వన్ ఎలక్షన్, ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ), వ్యవసాయ చట్టాలు వంటి కీలకమైన వాటిని అమలు చేయాలని ఆయన కోరారు.

మూడో టర్మ్‌లో ప్రధాని మోడీ చేయాల్సిన లిస్ట్: పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. మూడోసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ అధికారం కొనసాగిస్తారని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా ఆసక్తికర ప్రకటన చేశారు. ప్రధాని మోడీ తన మూడో టర్మ్‌లో చేయాల్సిన 10 అంశాల జాబితాను హర్ష్ గోయెంకా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. వాటిలో ప్రధానంగా 'వన్ నేషన్, వన్ ఎలక్షన్, ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ), వ్యవసాయ చట్టాలు వంటి కీలకమైన వాటిని అమలు చేయాలని ఆయన కోరారు. అలాగే, మౌలిక సదుపాయాలు, తయారీ, డిజిటలైజేషన్‌లో మరింత ముందుకెళ్లాలని, అంతర్జాతీయంగా భారత్ ఉనికి మరింత పెంచడం, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాల విస్తరణ ద్వారా ఆర్థికవ్యవస్థను పెంచే ప్రయత్నాలు చేస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా ప్రధాని మోడీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక సంస్కరణలతో పాటు ఉద్యోగాల కల్పన, ఇంధన, వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కాగా, హర్ష్ గోయెంకాకు స్పందిస్తూ నెటిజన్లు మరిన్ని అంశాలను ప్రస్తావించారు. రైల్వేలో ఎక్కువ పెట్టుబడులు, మధ్యతరగతి కోసం పన్ను హేతుబద్దీకరణ అవసరమని ఒక వ్యక్తి కోరాడు. పునరుత్పాదక శక్తి, సుస్థిరతపై దృష్టి సారించాలని, గ్రీన్ టెక్, క్లీన్ ఎనర్జీలో భారత్‌ను ప్రపంచ అగ్రగామి అవ్వాలని మరొక వ్యక్తి పేర్కొన్నాడు.

Next Story