Indore: స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్.. ఉత్తమ కంటోన్మెంట్‌గా సికింద్రాబాద్

by B.Srinivas |

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సిటీ అరుదైన ఘనత సాధించింది. వరుసగా ఎనిమిదో సారి దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది.

Indore: స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్.. ఉత్తమ కంటోన్మెంట్‌గా సికింద్రాబాద్
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సిటీ అరుదైన ఘనత సాధించింది. వరుసగా ఎనిమిదో సారి దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది. 2024-25కు గాను స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రకటించగా ఇండోర్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత గుజరాత్‌లోని సూరత్ సిటీ రెండో స్థానంలో, నవీ ముంబై మూడో ప్లేసులో, ఆంద్రప్రదేశ్‌లోని విజయవాడ నాలుగో స్థానంలో నిలిచాయి. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఇక, 3 లక్షల నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల విభాగంలో నోయిడా అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది. చండీగఢ్, మైసూర్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల విభాగంలో అహ్మదాబాద్ మొదటి స్థానంలో ఉంది.

ప్రపంచంలోనే అతిపెద్ద సర్వే

గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ తొమ్మిదో ఎడిషన్ ఘనత సాధించింది. ఈ సారి 4,589 నగరాలను కవర్ చేస్తూ సర్వే చేపట్టారు. దీంతో ప్రపంచంలోనే అతి పెద్ద క్వీనెస్ట్ సర్వేగా నిలిచింది. 3,000 కంటే ఎక్కువ శిక్షణ పొందిన నిపుణులు, 45 రోజులలో ప్రతి పట్టణ వార్డును కవర్ చేస్తూ దీనిని నిర్వహించారు. ఈ సారి అవార్డులను నాలుగు విభాగాల్లో ఇచ్చారు. మొత్తంగా 78 అవార్డులను ప్రదానం చేశారు.కంటోన్మెంట్ బోర్డు కింద ఇచ్చిన అవార్డుల్లో తొలి స్థానంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నిలిచింది. ఆదర్శప్రాయమైన పారిశుద్ధ్య ప్రయత్నాలకు గాను ఉత్తమ కంటోన్మెంట్ బోర్డుగా అవతరించింది. అలాగే పారిశుద్ధ్య కార్మికుల భద్రత, గౌరవం పట్ల అత్యుత్తమ నిబద్ధతకు గాను విశాఖపట్నం, జబల్‌పూర్, గోరఖ్‌పూర్‌లను ఉత్తమ సైఫైమిత్ర సురక్షిత్ షెహార్‌గా ప్రకటించారు.

ఏపీకి 5 అవార్డులు

స్వచ్చ సర్వేక్షన్ అవార్డుల్లో ఆంద్రప్రదేశ్‌లోని ఐదు నగరాలు ఎంపికయ్యాయి. పది లక్షల కంటే ఎక్కువ జనాభా కేటగిరీలో విజయవాడ, 3 నుంచి 10 లక్షల్లోపు కేటగిరీలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ , 50 వేల నుంచి మూడు లక్షలలోపు కేటగిరీలో తిరుపతి సిటీలు ఎంపికయ్యాయి. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) జాతీయ స్థాయిలో ప్రత్యేక కేటగిరీ మినిస్టీరియల్ అవార్డుకు ఎంపికైంది. అలాగే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్ర స్థాయిలో మినిస్టీరియల్ అవార్డు అందుకుంది.

Next Story