దేశంలో బిచ్చగాళ్లు లేని మొట్ట మొదటి నగరం ఇదేనట.. సుమారు 5 వేల మందికి పునరావాసం

by Ramesh Naini |

దేశంలోనే ఆ నగరం తొలి యాచకులు లేని నగరంగా మారిందని అధికారులు తాజాగా ప్రకటించారు.

దేశంలో బిచ్చగాళ్లు లేని మొట్ట మొదటి నగరం ఇదేనట.. సుమారు 5 వేల మందికి పునరావాసం
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Indore) ఇండోర్ దేశంలోనే (beggar-free city) తొలి యాచకులు లేని నగరంగా మారిందని అధికారులు తాజాగా ప్రకటించారు. ఒక ఏడాదికి ముందు నగరంలోని వీధుల్లో దాదాపు 5 వేల మంది యాచకులు ఉండేవారని వారు తెలిపారు. ఇండోర్ భారతదేశంలో మొట్టమొదటి యాచకులు లేని నగరంగా మారిందని జిల్లా మేజిస్ట్రేట్ (District Magistrate) ఆశిష్ సింగ్ అన్నారు. నగరంలోని యాచకులను ఉద్యోగాల్లో పెట్టామపి, వారికి పునరావాసం కల్పించామని, యాచిస్తున్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించామని ఆయన స్పష్టం చేశఆరు. భిక్షాటన నిర్మూలన కోసం తాము కృషి చేసినట్లు పేర్కొన్నారు. దీన్ని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ, ప్రపంచ బ్యాంకు బృందం కూడా గుర్తించాయని ఆశిష్ సింగ్ అన్నారు. ఇక భిక్షాటనను నిర్మూలించడానికి కేంద్ర మంత్రిత్వ శాఖ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన 10 నగరాల్లో ఇండోర్ ఒకటి అని తెలిపారు.

భిక్షాటన గురించి సమాచారం అందించే ఎవరికైనా రూ. 1,000 బహుమతి ఇస్తామని ప్రకటించినట్లు మరొక అధికారి చెప్పారు. ఇప్పటివరకు చాలా మందికి ఈ బహుమతి అందజేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ విషయంపై మహిళా, శిశు అభివృద్ధి శాఖ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ రామ్ నివాస్ బుధోలియా మాట్లాడుతూ.. యాచక వ్యతిరేక ప్రచారం ఫిబ్రవరి 2024 లో ప్రారంభించబడిందని చెప్పుకొచ్చారు. నగరంలో దాదాపు 5 వేల మంది యాచకులు ఉన్నారని, వారిలో 500 మంది పిల్లలు ఉన్నారని వెల్లడించారు. భిక్షాటన నిర్మూలనలో భాగంగా మొదటి దశలో తాము ఒక అవగాహన ప్రచారాన్ని నిర్వహించినట్లు తెలిపారు. రాజస్థాన్ నుంచి ఇండోర్‌కు భిక్షాటన చేయడానికి ప్రయాణించే చాలా మంది యాచకులను కూడా తాము గుర్తించామని చెప్పారు. ఇండోర్‌లో యాచించడం, యాచకులకు డబ్బు ఇవ్వడం నిషేధించబడిందన్నారు. ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటి వరకు మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు గుర్తుకు చేశారు.

Next Story