‘గణతంత్ర’ అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు! పాక్ టూర్ రద్దు?

by Mahesh Kanagandla |

ఈ సారి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో దాదాపుగా ఖరారయ్యారు. భారత గణతంత్ర వేడుకలు ముగిసిన తర్వాత ఆయన పాకిస్తాన్ వెళ్లబోవడం లేదని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

‘గణతంత్ర’ అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు! పాక్ టూర్ రద్దు?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ సారి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో దాదాపుగా ఖరారయ్యారు. భారత గణతంత్ర వేడుకలు ముగిసిన తర్వాత ఆయన పాకిస్తాన్ వెళ్లబోవడం లేదని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కేంద్ర విదేశాంగ శాఖ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉన్నది. గణతంత్ర వేడుకలకు ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతోను భారత్ ఆహ్వానించినట్టు ఆ దేశం ధ్రువీకరించింది. ఇండోనేషియా ప్రెసిడెంట్ సుబియాంతో భారత్ నుంచి పాకిస్తాన్ పర్యటించే షెడ్యూల్ పెట్టుకున్నారు. భారత్ ఆ పర్యటనపై అభ్యంతరం తెలిపింది.

భారత్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన విదేశీ పెద్దలు ఎవరూ నేరుగా పాకిస్తాన్‌కు వెళ్లలేదు. కానీ, ఇండోనేషియా ప్రెసిడెంట్ షెడ్యూల్‌లో భారత్ వెంటనే పాకిస్తాన్ పర్యటన ఉండటంతో గణతంత్ర దినోత్సవ వేడుకల ముఖ్య అతిథిగాపై ప్రకటన పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది. పాకిస్తాన్ పర్యటనను వాయిదా వేసుకోవడం లేదా.. మరో దేశానికి వెళ్లి అక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్లేలా ఆయన షెడ్యూల్‌లో మార్పులు చేసేలా భారత అధికారులు ప్రయత్నిస్తున్నట్టు కథనాలు వచ్చాయి.

Next Story