- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Indigo-Mahindra: ట్రేడ్ మార్క్ వివాదం.. కీలక నిర్ణయం తీసుకున్న మహీంద్రా..!
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశాని(India)కి చెందిన దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో(Indigo), ప్రముఖ ఆటోమొబైల్(Automobile) తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా(M&M) మధ్య ట్రేడ్ మార్క్(Trade Mark) వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. మహీంద్రా ఇటీవలే ఈవీ(EV) విభాగంలో కొత్త మోడల్ కారును లాంచ్ చేసింది. 'బీఈ 6ఈ(BE 6E)' పేరుతో దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. కాగా ఇండిగో ఆల్రెడీ 6ఈ కోడ్(Code)ను వివిధ సేవల్లో వాడుతోంది. ఎయిర్ లైన్ 6ఈ ప్రైమ్(Airline 6E Prime), 6ఈ ప్లెక్స్(6E Plex), లాంజ్ యాక్సెస్(Lounge Access) వంటి వాటి కోసం 6ఈని యూజ్ చేస్తోంది. దీంతో మహీంద్రా సంస్థ ట్రేడ్ మార్క్ ఉల్లంఘనకు పాల్పడిందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇండిగో ఢిల్లీ హైకోర్ట్(Delhi High Court)లో దావా వేసింది. ఈ కేసు డిసెంబర్ 9న విచారణకు రానుంది.
ఈ నేపథ్యంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. 'బీఈ 6ఈ' పేరుతో లాంచ్ చేసిన ఎలెక్ట్రిక్ కారు పేరును 'బీఈ 6(BE 6)'గా ఛేంజ్(Change) చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు శనివారం మహీంద్రా ఓ ప్రకటనలో అధికారికంగా వెల్లడించింది. కస్టమర్ల(Customers)ను అట్ట్రాక్ట్(Attract) చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూ.. వారికి మెరుగైన అనుభవాన్ని అందించడమే మా ముందున్న లక్ష్యం అని తెలిపింది. రెండు బహుళజాతి కంపెనీల మధ్య అనవసరమైన వివాదం ఏర్పడిందని, అందువల్లే తమ కారు పేరును ఛేంజ్ చేస్తున్నట్లు పేర్కొంది. బీఈ 6ఈ పై ఇండిగో చేస్తున్న ఆరోపణలును ఖండిస్తున్నామని, ఈ వివాదంపై కోర్టులో తమ పోరాటం(Fight) కొనసాగుతుందని మహీంద్రా వెల్లడించింది.