IndiGo: గాల్లో ఉండగా విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. తప్పిన పెను ప్రమాదం

by Ramesh Naini |

గాల్లో ఉండగానే విమానాన్ని పక్షి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇండిగో ఫ్లైట్‌కి పెను ప్రమాదం తప్పింది.

IndiGo: గాల్లో ఉండగా విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. తప్పిన పెను ప్రమాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: గాల్లో ఉండగానే విమానాన్ని పక్షి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇండిగో ఫ్లైట్‌కి పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ముంబై నుంచి డెహ్రాడూన్‌కి ఇండిగో 6E5032 ఫ్లైట్ వెళ్తుండగా చోటు చేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. డెహ్రాడూన్ ఎయిర్‌పోర్టులో సాయంత్రం 6:45 గంటల ప్రాంతంలో ల్యాండింగ్‌కి సిద్ధంగా ఉన్న టైమ్‌లో.. విమానాన్ని పక్షి ఆకస్మాత్తుగా ఢీకొట్టింది. వెంటనే పైలట్ అప్రమత్తమై విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశారు.

ఈ ఘటనలో విమానం ముక్కు భాగం పూర్తిగా దెబ్బ తిన్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో.. విమానంలో ఉన్న మొత్తం 186 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో ప్యాసింజర్స్, ఆఫీసర్లు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story