Mayday call: తప్పిన ముప్పు.. ‘మేడే కాల్’ ఇచ్చిన ఇండిగో విమానం.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండ్

by Ramesh Naini |

అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిరిండియా విమానం దుర్ఘటనలో (Mayday call) ‘మేడే కాల్’ సందేశం మరిచిపోకముందే మరో విమానం నుంచి మేడే కాల్ వచ్చింది.

Mayday call: తప్పిన ముప్పు.. ‘మేడే కాల్’ ఇచ్చిన ఇండిగో విమానం.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిరిండియా విమానం దుర్ఘటనలో (Mayday call) ‘మేడే కాల్’ సందేశం మరిచిపోకముందే మరో విమానం నుంచి మేడే కాల్ వచ్చింది. తాజాగా చెన్నైకి వెళ్లే ఇండిగో విమానం (IndiGo flight)లో ఇంధనం చాలా తక్కువగా ఉండటం వల్ల మేడే సందేశం ప్రకటించి సురక్షితంగా బయటపడింది. వివరాల్లోకి వెళితే.. గుహవాటి నుంచి చెన్నైకి ప్రయాణికులతో ఇండిగో విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కాసేపటికి ఇంధనం తగినంత లేదని, తక్కువగా ఉన్నట్లు పైలట్ గుర్తించారు. వెంటనే పైలట్‌ ఏటీసీకి ‘మేడే’ సందేశం పంపారు. తక్షణమే బెంగళూరులో పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ (emergency landing) చేశారు. దీంతో విమానానికి ముప్పు తప్పినట్లైంది. ఈ ఘటన దాదాపు మూడు రోజుల క్రితం చోటు చేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

కాగా, మేడే కాల్ అనేది విమానం నడిపేటప్పుడు అత్యవసర ప్రమాద పరిస్థితుల్లో రేడియో కమ్యూనికేషన్ ద్వారా సమీపంలోని ఏటీసీకి సమాచారం అందిస్తారు. ఆపదలో ఉన్నామని, తక్షణమే సహాయం అవసరమని మేడే కాల్ ద్వారా విజ్ఞప్తి చేస్తారు. ఇటీవల అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం కుప్పకూలి మొత్తం 241 మంది ప్రయాణికులు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే విమానం కూలిపోయే ముందు పైలట్లు మేడే కాల్ సందేశం పంపారు. అందులో మేడే అంటూ వరుసగా మూడు సార్లు చెప్పి.. నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్.. అని పైలట్ అన్నట్లుగా అధికారులు తెలిపారు. అయితే ఏటీసీ స్పందించేలోగానే విమానం కుప్పకూలిపోయింది.

Next Story