- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండిగో సంక్షోభం: కేంద్ర ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర ఆరోపణలు
దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్ లైన్స్ విమాన సేవలకు అంతరాయం ఏర్పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్ లైన్స్ (IndiGo crisis) విమాన సేవలకు అంతరాయం ఏర్పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ఐదు రోజులుగా విమానాలు రద్దు కావడంతో అనేక మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రతిపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఎక్స్ వేదికగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. దేశవ్యాప్తంగా తీవ్ర విమాన రవాణా సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో, వేలాది విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డీకే శివకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తన ట్వీట్‌లో, కేంద్ర ప్రభుత్వం తప్పుదోవపట్టించే విధానాలే ప్రస్తుత పరిస్థితికి కారణమని ఆరోపించారు.
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, దేశంలో మూడో అత్యంత రద్దీ గల విమానాశ్రయం అని అన్నారు. అయితే ఆ విమానాశ్రయం పూర్తిగా గందరగోళంగా మారిందని, ఇది కుటుంబాలు, వ్యాపారాలు మాత్రమే కాక దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని ఆయన ఆరోపించారు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని పరిస్థితిని అదుపులోకి తేవాలని శివకుమార్ డిమాండ్ చేశారు. ‘మన ప్రజలు ఇలాంటి పరిస్థితులకు గురికావడం బాధాకరం, వారికి మెరుగైన సేవలు లభించాలి’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.






