- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండిగో సంక్షోభం: ధరల నియంత్రణకు కేంద్రం కఠిన చర్యలు
ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో, ప్రయాణికులకు ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.

దిశ, వెబ్ డెస్క్: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో, ప్రయాణికులకు ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) కఠిన చర్యలు చేపట్టింది. విమానయాన సంస్థలు అమాంతం టిక్కెట్ ధరలు పెంచకుండా ఉండేందుకు, విమాన సర్వీసుల ఛార్జీలపై కేంద్రం గరిష్ట పరిమితిని నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, 500 కిలోమీటర్ల వరకు గరిష్ఠంగా రూ. 7,500, 500 కి.మీ. నుండి 1000 కి.మీ. వరకు రూ. 12,000, అలాగే 1000 కి.మీ. నుండి 1500 కి.మీ. వరకు రూ. 15,000 మాత్రమే ఛార్జ్ వసూలు చేయడానికి అనుమతి ఉంటుంది. అలాగే చార్జీల పరిమితులు బిజినెస్ క్లాస్, RCS ,UDAAN విమానాలకు వర్తించవని కేంద్ర ప్రకటించింది.
అంతేకాకుండా, ఈ ఉదయం నుంచే కేంద్రం అన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలకు (AirlinesCompanies) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, సర్వీసులలో అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇండిగో సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని, అత్యవసర పరిస్థితుల్లో టికెట్ ధరలను కృత్రిమంగా పెంచడానికి ఏ సంస్థ ప్రయత్నించినా కఠిన చర్యలు (Strict action) ఉంటాయని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే.






