విమానంలో ప్రయాణికుడిని కొట్టిన వ్యక్తిపై బ్యాన్ విధించిన ఇండిగో

by Ajay Maddhiboyina |

ముంబై నుండి కోల్ కతా వెళుతున్న ఇండిగో విమానంలో పానిక్ ఎటాక్‌కు గురైన ప్రయాణికుడిని మరో ప్రయాణికుడు చెంపపై కొట్టడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

విమానంలో ప్రయాణికుడిని కొట్టిన వ్యక్తిపై బ్యాన్ విధించిన ఇండిగో
X

దిశ‌, వెబ్ డెస్క్: ముంబై నుండి కోల్ కతా వెళుతున్న ఇండిగో విమానంలో పానిక్ ఎటాక్‌కు గురైన ప్రయాణికుడిని మరో ప్రయాణికుడు చెంపపై కొట్టడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. హుస్సేన్ అనే ప్ర‌యాణికుడు భ‌య‌ప‌డిపోయి ఆందోళ‌న చెంద‌గా త‌న‌కు ఇబ్బందిగా ఉంది అంటూ తోటి ప్రయాణికుడు అత‌డిపై చేయి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ అవ్వ‌డంతో ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొట్టిన ప్రయాణికుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పెద్దఎత్తున డిమాండ్లు వచ్చాయి. ఈ ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

విమానంలో వికృతంగా ప్ర‌వ‌ర్తన‌ను అంగీక‌రించేదిలేద‌నే మా నిబద్ధ‌త‌కు అనుగుణంగా తోటి ప్రయాణికుడిపై బ్యాన్ విధిస్తున్నాం. అత‌డు ఇక‌పై ఏ ఇండిగో విమానాల్లో ప్ర‌యాణించ‌లేడు. అని ప్ర‌క‌టించింది. ఇండిగో క‌స్ట‌మ‌ర్లు, సిబ్బంది భ‌ద్ర‌తకే త‌మ ప్రాధాన్య‌త‌ ఉంటుంద‌ని పేర్కొంది. ఇదిలా ఉంటే భ‌యాందోళ‌న‌కు గురైన హుస్సేన్ కోల్ క‌తా విమానాశ్ర‌యం నుండి సిల్చార్‌కు కనెక్టింగ్ విమానంలో ప్రయాణించాల్సి ఉండగా అతడు కనిపించకుండా పోయాడు. కోల్ కతాలో విమానం దిగిన తరవాత అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అస్సాంకు చెందిన అతడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఘటనపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.

Next Story