ఇండిగో ఎయిర్‌లైన్స్ వ్యవహారం.. DGCA మానిటరింగ్ టీమ్ ఏర్పాటు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-10 12:08:01  IST  )

ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo Airlines) సంక్షోభం కొనసాగుతున్న వేళ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఇండిగో ఎయిర్‌లైన్స్ వ్యవహారం.. DGCA మానిటరింగ్ టీమ్ ఏర్పాటు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo Airlines) సంక్షోభం కొనసాగుతున్న వేళ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో కార్యాలయాల్లో కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు మొత్తం 8 మంది సభ్యులతో కూడిన మానిటరింగ్ టీమ్‌ (Monitoring Team)ను ఏర్పాటు చేసింది. గత కొన్ని రోజులుగా ఇండిగో విమానాలు ఆలస్యం కావడం, రద్దు అవుతున్న సంఘటనలు పెరగడంతో పాటు ప్రయాణికుల ఫిర్యాదులు పెరిగాయి.

దీంతో తాజాగా నియమించబడిన మానిటరింగ్ టీమ్ పరిస్థితి పూర్తిగా మామూలు స్థితికి వచ్చే వరకు ఇండిగో ఆపరేషన్స్, సిబ్బంది షెడ్యూలింగ్, విమాన నిర్వహణ వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించనుంది. ఢిల్లీ (Delhi), గురుగ్రామ్‌ (Gurugram)లోని ఇండిగో ప్రధాన కార్యాలయాలతో పాటు మరికొన్ని కీలక కేంద్రాల్లో DGCA మానిటరింగ్ టీమ్ ఈ రాత్రి నుంచే తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి పరిశీలనల తర్వాత DGCA నివేదిక ఆధారంగా ఇండిగో ఎయిర్‌లైన్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

Next Story