యువతతోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. ప్రధాని మోడీ

by Sathputhe Rajesh |

యువత ప్రోద్భలంతో సామాజికంగా, సాంస్కృతికంగా సాధికరత సాధించి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుందని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

యువతతోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : యువత ప్రోద్భలంతో సామాజికంగా, సాంస్కృతికంగా సాధికరత సాధించి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుందని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’లో ఆదివారం ఈ మేరకు ప్రధాని మోడీ మాట్లాడారు. ‘దేశ యువత సామర్థ్యాలు భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలుపుతాయి. పెద్ద లక్ష్యాలు ఎంచుకుని దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఇదే ప్రస్తుతం భారత్ చేస్తోంది.అభివృద్ధి చెందిన భారత్ ఆర్థికంగా, వ్యూహాత్మకంగా, సామాజికంగా, సాంస్కృతికంగా సాధికరత పొందుతుంది.’ అని మోడీ అన్నారు.

తమ లక్ష్యం కొంత మందిగా ఇబ్బందిగా అనిపించవచ్చు అని.. అయితే అది అసాధ్యం మాత్రం కాదన్నారు. భారత దేశ యువత సామర్థ్యాలు దేశం అభివృద్ధి చెందడానికి శక్తిని ఇస్తాయన్నారు. ‘వికసిత్ భారత్’ ప్రతి అడుగులో మార్గదర్శనం చేస్తే.. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడాన్ని ఏ శక్తీ ఆపలేదన్నారు. 2030 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని అంతకంటే ముందే టార్గెట్ చేరుకుంటామని ప్రధాని అన్నారు. ప్రభుత్వం మాత్రమే దేశాన్ని ముందుకు నడపలేదన్నారు. ‘వికసిత్ భారత్’ యువత సారథ్యం వహించి దేశాన్ని ముందుకు నడపాలన్నారు. యువత ఆలోచనలు విధానాల్లో భాగం కావాలన్నారు. తద్వారా అవే మనల్ని దిశానిర్దేశం చేస్తాయన్నారు. గొప్ప లక్ష్యాలను సాధించాలంటే ప్రతి పౌరుడి చురుకైన భాగస్వామ్యం అవసరమన్నారు.

Next Story