- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pahalagam Terror Attack :భారత్ కఠిన నిర్ణయాలు.. మరి సీమా పరిస్థితి ఏంటి?
పహల్గామ్ ఉగ్రదాడి(Pahalagam Terror Attack) నేపథ్యంలో పాకిస్తాన్ పట్ల భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : పహల్గామ్ ఉగ్రదాడి(Pahalagam Terror Attack) నేపథ్యంలో పాకిస్తాన్ పట్ల భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. పాక్ పౌరుల, పర్యటకుల వీసాలను రద్దు చేసింది. తక్షణమే భారత్‌ను విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్లు చేసి.. పాకిస్థానీయులను పంపేయాలని ఆదేశాలు ఇచ్చారు. కేంద్రం ఆదేశాలతో అన్నిరాష్ట్రాల పోలీసులు.. అణువణువు జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీమా హైదర్(Seema Hyder) అంశం తెర మీదకి వచ్చింది. పబ్‌జీ ఆడుతూ ఇద్దరూ ప్రేమలో పడి.. 2023లో ప్రియుడి సచిన్ మీనా కోసం పాకిస్థాన్ నుంచి నేపాల్ మీదుగా భారత్‌కు వచ్చేసిన సీమా... ప్రస్తుతం భర్తతో కలిసి ఢిల్లీలో ఉంటోంది. ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
అయితే మంగళవారం జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్రం పాక్ పౌరుల వీసాలు రద్దు చేసింది. కేంద్రం ఆదేశాలతో సీమా హైదర్ కూడా పాకిస్థాన్ వెళ్లిపోవల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సీమా హైదర్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే ఆమెకు సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఉపశమనం లభించొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి. అయితే ఆమె లాయర్ మాత్రం సీమా పౌరసత్వం ఆమె భర్తతో ముడిపడి ఉందని, కేంద్ర ఆదేశాలు వర్తించవని పేర్కొన్నారు.






