Trump: అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య సంబంధాలు పెంచుకునేందుకే..

by Shamantha N |   (  Updated:2025-03-09 16:17:40  IST  )

అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య సంబంధాలను పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే టారీఫ్ ల తగ్గింపు అని భారత్ పేర్కొంది.

Trump: అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య సంబంధాలు పెంచుకునేందుకే..
X

దిశ, నేషనల్ బ్యూరో: అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య సంబంధాలను పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే టారీఫ్ ల తగ్గింపు అని భారత్ పేర్కొంది. సుంకాల విషయంలో భారత్ (India)పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను న్యూఢిల్లీ ఖండించింది. భారత్ అత్యధికంగా పన్నులు వసూలు చేస్తుందని.. బహిరంగంగా ఈ సమస్యలను లేవనెత్తడం వల్లే ఆ దేశం టారీఫ్ లను తగ్గించేందుకు అంగీకరించిందని ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే, బారత్ మాత్రం ఈ విషయాన్ని తోసిపుచ్చిందిం సుంకాల తగ్గింపు వాస్తవమేనని.. కానీ ట్రంప్ ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకోలేదని భారత్ పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య సంబంధాలను పెంచుకునేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించినట్లు కథనలు వస్తున్నాయి. గతంలోనూ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో భారత్‌ వరుసగా ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, స్విట్జర్లాండ్, నార్వే వంటి దేశాలపై న్యూఢిల్లీ సుంకాలను తగ్గించిందని అధికారులు అన్నారు. ప్రస్తుతం ఈయూ, యూకేతోనూ పలు ఒప్పందాల కోసం చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే అగ్రరాజ్యంతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి వీటిని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్ల పేర్కొన్నారు. అంతే కానీ, అమెరికా భారత్‌పై విధించనున్న సుంకాల అమలుకు సమయం దగ్గరపడుతున్నందుకు కాదని భారత అధికారులు చెబుతున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.

బహుళ రంగాల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ఇకపోతే, భారత్ కి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గత ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో 118.2 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. కాగా.. 2030 నాటికి దీనిని 500 బిలియన్‌ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో భారత్‌ ముందుకు వెళ్తోంది. మోడీ అమెరికా పర్యటనలో.. 2025 చివరి నాటికి.. ఇరుదేశాల మధ్య పరస్పరం ప్రయోజనకరమైన బహుళ రంగాల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) తొలిదశపై చర్చలు జరపడానికి ట్రంప్‌ అంగీకరించారు. మరిన్ని వస్తువుల ఎగుమతిదిగుమతులు, సుంకాల అడ్డంకులను తొలగించేందుకు ఇరుదేశాల నేతలు ఒప్పందం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు.. భారత్, చైనా సహా పలు దేశాలపై ట్రంప్ భారీగా సుంకాలు విధిస్తానన్నారు. అంతేకాకుండా, భారత్ ని టారీఫ్ కింగ్ గా పేర్కొన్నారు. ఏప్రిల్‌ 2 నుంచి భారత్‌, చైనాలపై సుంకాలు విధించినున్నట్లు అమెరికా పేర్కొంది. అయితే, దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. పన్నులు, సహా ఇతర అడ్డంకులు అధిగమించేందుకే బీటీఏ కింద అమెరికాతో బంధాలు బలోపేతం చేసుకుంటామంది.

Read Also..

Bitcoin vs Gold: బిట్‌కాయిన్ బంగారు సింహాసనాన్ని లాక్కుంటుందా? మనం ఎందులో పెట్టుబడి పెట్టాలి?

Next Story