- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాస్‌పోర్టుల ర్యాంకింగ్‌లో భారత్‌కు పురోగతి.. కానీ, తగ్గిన వీసా రహిత దేశాలు!
ప్రపంచంలోని శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాను హెన్లీ పాస్‌పోర్టు సూచీ-2025 విడుదల చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలోని శక్తివంతమైన పాస్‌పోర్టుల (Passport) జాబితాను హెన్లీ పాస్‌పోర్టు సూచీ-2025 విడుదల చేసింది. ఇందులో భారత పాస్‌పోర్టు (Indian Passport) స్థానం గతేడాదితో పోలిస్తే ఈసారి కొంత మెరుగైంది. గతేడాది 80వ స్థానంలో ఉన్న భారత్ ఈసారి 77వ స్థానానికి చేరుకుంది. అయితే, వీసా రహితంగా ప్రయాణించగల దేశాల సంఖ్య మాత్రం 62 నుంచి 59కి తగ్గింది. మలేసియా, ఇండోనేసియా, మాల్దీవులు, థాయ్‌లాండ్ వంటి దేశాలు వీసా లేకుండా ప్రవేశాన్ని అనుమతిస్తుండగా, శ్రీలంక, మకావు, మయన్మార్ వంటి కొన్ని దేశాలు వీసా ఆన్ అరైవల్ (Visa on Arrival) సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.
ఇక ఈ జాబితాలో సింగపూర్ పాస్ పోర్టు అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గతేడాది ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలవగా.. ఈసారి సింగపూర్ మాత్రమే తొలి స్థానంలో నిలిచింది. సింగపూర్ పాస్‌పోర్టుతో ఏకంగా 193 దేశాలకు వీసా అవసరం లేకుండా ప్రయాణించవచ్చు. రెండో స్థానంలో ఉన్న జపాన్, దక్షిణకొరియాల పాస్‌పోర్టులు ఉండగా.. వాటి పాస్‌పోర్టులతో 190 దేశాలు చుట్టిరావచ్చు. డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, స్పెయిన్‌లు మూడో స్థానంలో ఉన్నాయి. అలాగే, ఈ జాబితాలో అఫ్గానిస్థాన్ చివరి స్థానంలో ఉంది. ఇక్కడి పాస్‌పోర్టుతో కేవలం 25 దేశాలకు మాత్రమే వీసా ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. కాగా, వీసా రహిత ప్రయాణాలను అనుమతించే దేశాల సంఖ్య ఆధారంగా పాస్‌పోర్టు శక్తిని లెక్కిస్తారు.






