Operation Sindoor: పాక్ ఉగ్రవాద వ్యతిరేక ప్రచారం ప్రారంభం

by S Gopi |

సంజయ్ ఝా ప్రతినిధి బృందం ఉదయం 11.40 గంటలకు జపాన్‌కు బయలుదేరింది.

Operation Sindoor: పాక్ ఉగ్రవాద వ్యతిరేక ప్రచారం ప్రారంభం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ బుద్ధిని అంతర్జాతీయంగా బహిర్గతం చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందాలు బుధవారం పర్యటనను ప్రారంభించాయి. సంజయ్ ఝా, శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని రెండు ప్రతినిధి బృందాలు బుధవారం బయలుదేరాయి. సంజయ్ ఝా ప్రతినిధి బృందం ఉదయం 11.40 గంటలకు జపాన్‌కు వెళ్లగా, శ్రీకాంత్ షిండే ప్రతినిధి బృందం రాత్రి 9 గంటలకు యూఏఈకి బయలుదేరింది. ఒత్తం ఏడు అఖిలపక్ష ప్రతినిధుల బృందాలను ఏర్పాటు చేయగా, వాటిలో ఎంపీలు, మాజీ పార్లమెంట్ సభ్యులతో కూడిన మూడింటికి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వివరాలను తెలియజేశారు. పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత వైఖరిని విదేశాల్లో వారు ఎలా వివరించాలో చెప్పారు. అఖిలపక్ష బృందాలు పర్యటించేందుకు ఎంచుకున 33 దేశాలను ఏ అంశాల ఆధరంగా ఎంపిక చేశారనే విషయాన్ని కూడా వివరించారు. 'భారత్ శాంతికి కట్టుబడి ఉన్నప్పటికీ, సొంతగడ్డపై జరిగే ఉగ్రవాద దాడులను ఎలాంటి పరిస్థితుల్లోనూ సహించదు. అందుకు తగిన విధంగా బదులిస్తుందని, ఇకపై ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ప్రతీకారం తీర్చుకుంటుంది' అని విక్రమ్ మిస్రీ బృందాలతో చెప్పారు.

జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, మలేషియా, ఇండోనేషియాలకు వెళ్లిన ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న జేడీ(యూ) నేత సంజయ్ ఝా విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు ప్రపంచం ముందు పాకిస్తాన్ నాటకాలు చెల్లుబాటు అయ్యాయి. ఇప్పటివరకు ఉగ్రవాదంపై చర్యలు తీసుకుంటామని పాక్ చెప్పిన మాటలపై భారత్‌కు విశ్వాసం పోయింది. పాకిస్తాన్ పదేపదే 'తన నేరాన్ని స్వయంగా పరిశోధించాలని అడిగే దొంగ' తరహాలో వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. యూఏఈ, ఆఫ్రికన్ దేశాలకు వెళ్లిన ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే.. భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ జరిగే ఉగ్రవాద దాడులలో పాకిస్తాన్ ప్రమేయం ఉందని రుజువులను సమర్పిస్తాం. మానవాళికి వ్యతిరేకంగా చేస్తున్న నేరాలలో పాక్ పాత్రను స్పష్టంగా చూపగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, అన్ని బృందాలు మొత్తం 33 దేశాలకు వెళ్లనున్నాయి. వీటిని 15 ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ఉన్న సభ్య దేశాలు, మరికొన్ని భవిష్యత్తులో చేరబోయే దేశాల ఆధారంగా ఎంపిక చేశారు.

Next Story