- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అమెరికాలో అరెస్ట్
భారతదేశ జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న క్రిమినల్, పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ పవిత్తర్ సింగ్ బటాలా అమెరికాలో అరెస్టయ్యాడు.

దిశ, వెబ్ డెస్క్: భారతదేశ జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ పవిత్తర్ సింగ్ బటాలా అమెరికాలో అరెస్టయ్యాడు. నిషేధిత ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI)తో సంబంధాలున్న బటాలా సహా మరో ఏడుగురు ఖలిస్తానీ ఉగ్రవాదులను అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) అరెస్టు చేసింది. శాన్ జోక్విన్ కౌంటీలో జరిగిన కిడ్నాప్, హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసులో వీరిని శుక్రవారం అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. వారిపై కిడ్నాప్, హింస, నిర్బంధం, సాక్షిని బెదిరించడం, తుపాకులతో దాడి చేయడం వంటి అభియోగాలు ఉన్నాయి. అరెస్టు సమయంలో వారి వద్ద నుంచి ఆరు తుపాకులు, ఆటోమేటిక్ గ్లాక్, వందల రౌండ్ల బుల్లెట్లు, మ్యాగజైన్‌లు, ఇంకా $15,000కు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు.
అనుమానితుల్లో దిల్‌ప్రీత్ సింగ్, అమృత్‌పాల్ సింగ్, అర్ష్‌ప్రీత్ సింగ్, మన్‌ప్రీత్ రంధావా, సరబ్‌జిత్ సింగ్, గుర్తాజ్ సింగ్, విశాల్ ఉన్నారు. వీరందరినీ శాన్ జోక్విన్ కౌంటీ జైలుకు తరలించారు. ఇటీవల భారతదేశానికి చెందిన అనేక మంది గ్యాంగ్‌స్టర్లు మరియు ఉగ్రవాదులు గోల్డీ బ్రార్, అన్మోల్ బిష్ణోయ్, రోహిత్ గొదారా లాంటి వారు చట్టానికి దూరంగా ఉండేందుకు అమెరికా, కెనడాలను తమ రహస్య స్థావరాలుగా మలుచుకుంటున్నారు. వారు అక్కడి నుంచే భారత్‌లో తమ నేర కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.






