రష్యా - ఉక్రెయిన్ యుద్ధం.. రెండు దేశాలకు భారత్ కీలక పిలుపు

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-16 12:45:20  IST  )

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్ సమావేశాన్ని భారత్(India) స్వాగతించింది.

రష్యా - ఉక్రెయిన్ యుద్ధం.. రెండు దేశాలకు భారత్ కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్ సమావేశాన్ని భారత్(India) స్వాగతించింది. ట్రంప్, పుతిన్ సమావేశంలో సాధించిన పురోగతిపై భారత్ అభినందనలు తెలిపింది. శాంతి సాధనలో ఇద్దరి నాయకత్వం ఎంతో ప్రశంసనీయం అని పేర్కొంది. సమస్యల పరిష్కారానికి చర్చలు, దౌత్య మార్గాల్లోనే ముందుకు వెళ్లాలని భారత్ సూచించింది. రష్యా, ఉక్రెయిన్(Ukraine) యుద్ధం ముగియాలని ప్రపంచ దేశాలతో పాటు భారత్‌ కూడా కోరుకుంటోందని వెల్లడించింది. మరోవైపు రష్యా-ఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ రెండు దేశాలు నేరుగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే యుద్ధాన్ని ముగించేందుకు ఉత్తమమార్గంగా పేర్కొన్నారు. కాల్పుల విరమణ నిలబడే అవకాశాలు తక్కువేనని చెప్పారు.

Body-Double: ట్రంప్ ను కలిసింది అసలు పుతిన్ కాదా?.. బాడీ డబుల్ పై జోరుగా చర్చ.. మోడీ, రాహుల్ కు బాడీ డబుల్?

Next Story