- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Body-Double: ట్రంప్ ను కలిసింది అసలు పుతిన్ కాదా?.. బాడీ డబుల్ పై జోరుగా చర్చ.. మోడీ, రాహుల్ కు బాడీ డబుల్?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ భేటీ ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump), రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ భేటీ ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఉప్పు నిప్పులా ఉండే ఈ ఇరు దేశాధ్యక్షులు భేటీ కావడం సర్వత్రా ఉత్కంఠ రేపింది. అలాస్కా (Alaska Meeting) వేదికగా జరిగిన ఇరువురు నేతల భేటీ వాడీవేడీగా సాగుతుందని అంతా భావించారు. కానీ అందుకు పూర్తిగా భిన్నంగా ట్రప్-పుతిన్ చాలా ఆత్మీయంగా కనిపిచండం అదరినీ ఆశ్చర్యపరిచింది. అంతా సాఫీగా జరిగిన ఈ భేటీపై ఇప్పుడు సరికొత్త చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ట్రంప్ ను కలిసింది నిజమైన పుతిన్ కాదని పుతిన్ 'బాడీ డబుల్' (Putin Body Double) అంటూ జోరుగా చర్చ జరుగుతోంది. ట్రంప్ తో సమావేశంలో పుతిన్ హావభావాలపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కనిపించని క్లాసిక్ కేజీబీ వాక్ స్టైల్:
పుతిన్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది కేజీబీ వాకింగ్ స్టైల్. గతంలో రష్యాకు చెందిన కేజీబీ గూడాచారిగా పని చేసిన పుతిన్ కుడి చేతిన కదిలించకుండా ఎడమచేతిని కదిలిస్తూ నడుస్తుంటారు. ఇది ఆయన ట్రెండ్ గా మారిపోయింది. తాజాగా అయితే ట్రంప్ తో భేటీ సందర్భంగా పుతిన్ ట్రేడ్ మార్క్ అయిన గన్ స్లింగర్ వాక్ లేదని ముఖ్యంగా ఆయన తన కుడి చేతిని కలిలిస్తున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే అతడి చెంపలు నునుపుగా ఉన్నాయని నిజమైన పుతిన్ కంటే ఎక్కువ జోయల్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అసలు పుతిన్ ఎక్కడో ఉంటే పుతిని బాడీ డబుల్ ట్రంప్ తో ఉన్నారంటూ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమైన కార్యక్రమాలు, సమావేశాలకు పుతిన్ తన బాడీ డబుల్ ను పంపుతారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ట్రంపుతో భేటీ విషయంలోనూ పుతిన్ అదే చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ భేటీ సందర్భంగా ట్రంప్ తో కలిసి అమెరికా అధ్యక్షుడి 'బీస్ట్' వాహనశ్రేణిలో ప్రయాణించడం అందరిని ఆశ్చర్యపరిచింది. నిజానికి పుతిన్ ఎక్కడకు వెళ్లినా తనకంటే ముందే సొంత వాహన శ్రేణి అక్కడుంటుంది. అలాస్కాకు కూడా మాస్కో నంబర్ ప్లేట్ తో ఉన్న వాహనశ్రేణి చేరుకున్నప్పటికీ అనూహ్యంగా బీస్ట్ లో ప్రయాణించడం చర్చనీయాశం అయింది.
రాజుల కాలం నుంచి రాహుల్ గాంధీ వరకు:
అత్యంత ముఖ్యమైన నాయకులు, సినిమా స్టార్లు బాడీ డబుల్స్ ఉపయోగిస్తుంటారు. ప్రాచీన కాలంలో రాజులు, చక్రవర్తులు తమ యుద్ధాలకు లేదా ప్రజల వద్దకు తమ వంటి పోలీకలతో ఉన్న వారిని పంపించేవారని చరిత్ర చెబుతోంది. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ బాడీ డబుల్ ఉపయోగించారని ఇక సద్దాం హుస్సేన్ దగ్గర ఏకంగా 3-4 బాడీ డబుల్స్ ఉండేవారని అమెరికా గూఢచారి సంస్థలు ధృవీకరించారయి. తమ ప్రాణాలకు హాని కలగకుండా, గాయాలు కాకుండా తమ స్థానంలో తమ వంటి పోలీకలతో ఉన్నవారిని ఉపయోగించడం ఇప్పటికీ కొనసాగుతోంది. భారత దేశ రాజకీయాల్లోనూ బాడీ డబుల్ మాట అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. మోడీకి బాడీ డబుల్ ఉన్నారని ప్రచారం జరిగినా మోడీ పోలీకలతో అనేక మంది సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటారు. ఇక భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బాడీ డబుల్ (Rahul Gandhi Body Double) ఉపయోగించారని బీజేపీ ఆరోపించింది. అసోంలో యాత్ర కొనసాగుతున్న సమయంలో బస్సులో కూర్చుని ప్రజలకు అభివాదం చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ కాదని ఆయన బాడీ డబుల్ అంటూ ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వా శర్మ ఆరోపించడం అప్పట్లో కలకలం రేపింది.






