IMR: భారత్‌ రికార్డు స్థాయిలో తగ్గిన శిశు మరణాల రేటు

by Prasad Jukanti |

భారత్ లో శిశు మరణాల రేటు విషయంలో కీలక అప్ డేట్ వచ్చింది.

IMR: భారత్‌ రికార్డు స్థాయిలో తగ్గిన శిశు మరణాల రేటు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్ లో శిశు మరణాల రేటు రికార్డు స్థాయి కనిష్టానికి తగ్గిపోయిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా భారత రిజిస్ట్రార్ జనరల్ జారీ చేసిన 2023 ఇన్ఫంట్ మోర్టాలిటీ రేట్ (IMR)నివేదిక ప్రకారం ప్రస్తుతం దేశంలో శిశుమరణాల రేటు 25 కు చేరుకుందని స్పష్టం చేసింది. 2013 లో 40 గా ఉన్న ఈ రేటు గణనీయంగా పడిపోయిందని తెలిపింది. ఐఎంఆర్ అనేది కీలకమైన ప్రజారోగ్య సూచిక. ఇది ఒక ఏడాదిలోపు ప్రతి 1000 మంది సజీవ జననాలకు పిల్లల మరణాలతో పోల్చి లెక్కిస్తారు. ఈ సంఖ్య తక్కువగా ఉండే ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా ఉన్నట్లు. 2023 డేటాను పరిగణలోకి తీసుకున్న ఎస్ఆర్ఎస్ 2023 నివేదిక ప్రకారం 1971 లో 129 గా ఉన్న శిశుమరణాల రేటు క్రమంగా తగ్గుతూ వస్తు ప్రస్తుతం 25 వద్దకు చేరుకుంది. తాజా నివేదిక ప్రకారం మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, యూపీలో దేశంలోనే అత్యధికంగా శిశుమరణాల రేటు 37 ఉండగా అత్యల్పంగా మణిపూర్ లో 3 మాత్రమే ఉంది. మణిపూర్ తర్వాత ఐదుగురితో రెండో స్థానంలో కేరళ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో శిశుమరణాల సంఖ్య 44 నుంచి 28 కి తగ్గిందని ఈ నివేదిక పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 27 నుంచి 18కి తగ్గింది.

Next Story