UNDP: మానవాభివృద్ధి సూచీలో భారత్ పురోగతి.. ఎన్నో స్థానమంటే?

by Shamantha N |

ప్రపంచ ‘మానవాభివృద్ధి సూచీ (HDI)’లో భారత్‌ (India) భారత్ 130వ స్థానానికి ఎగబాకింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) కి సంబంధించిన మానవాభివృద్ధి సూచీ-2025 నివేదిక మంగళవారం విడుదలైంది.

UNDP: మానవాభివృద్ధి సూచీలో భారత్ పురోగతి.. ఎన్నో స్థానమంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ ‘మానవాభివృద్ధి సూచీ (HDI)’లో భారత్‌ (India) భారత్ 130వ స్థానానికి ఎగబాకింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) కి సంబంధించిన మానవాభివృద్ధి సూచీ-2025 నివేదిక మంగళవారం విడుదలైంది. ఈ నివేదికలో 2023 ఏడాదికి సంబంధించిన డేటాను ప్రకటించారు. 2023 ఏడాదికి సంబంధించి మొత్తం 193 దేశాల్లో భారత్‌కు 130వ స్థానం దక్కింది. అంతకుముందు ఏడాది అంటే 2022తో పోల్చుకుంటే మూడు స్థానాలు మెరుగుపడింది. 2022 ఏడాదికి సంబంధించిన మానవాభివృద్ధి సూచీలో భారత్‌ 133వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఏడాది మూడు స్థానాలు పురోగతి చెందింది.

లింగ అసమానత సూచీలోనూ..

ఇకపోతే, లింగ అసమానత సూచీలో కూడా భారత్‌ పురోగతి సాధించింది. 2023లో మొత్తం 193 దేశాల్లో భారత్‌ 102వ స్థానంలో నిలిచింది. అంతకుముందు ఏడాది 166 దేశాల్లో భారత్‌ 108వ స్థానం దక్కించుకుంది. అంటే ఈ ఏడాది ఆరు స్థానాలు మెరుగుపడింది. హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌- 2025 ప్రకారం భారతీయుల జీవిత కాలం కూడా మెరుగుపడింది. 2023లో భారత పౌరుడి సగటు జీవితకాలం 72 ఏళ్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది అంటే 2022లో భారత పౌరుడి సగటు జీవితకాలం 71.7 ఏళ్లుగా ఉంది. ఇప్పటికే వరకు ఇచ్చిన నివేదికల్లో ఇదే అత్యధిక సగటు జీవితకాలమని యూఎన్‌డీపీ పేర్కొంది.

Next Story