- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
USAID: యూఎస్ఎయిడ్ ఎఫెక్ట్.. హైదరాబాద్ లోని క్లినిక్ మూసివేత
ప్రపంచదేశాలకు ఆర్థికసాయం అందించే యూఎస్ ఎయిడ్ (USAID) సేవలను అమెరికా నిలిపివేసింది. కాగా.. ఈ ప్రభావం భారత్ పై పడింది.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచదేశాలకు ఆర్థికసాయం అందించే యూఎస్ ఎయిడ్ (USAID) సేవలను అమెరికా నిలిపివేసింది. కాగా.. ఈ ప్రభావం భారత్ పై పడింది. భారత్ లోని ట్రాన్స్ జెండర్ల(Clinics For Transgenders) కోసం ఏర్పాటు చేసిన 3 క్లినిక్ లు మూతపడినట్లు తెలుస్తోంది. దీనివల్ల దాదాపు 5 వేల మందికి వైద్యసేవలు అందట్లేదని నివేదికలు పేర్కొంటున్నాయి. దేశంలోనే మొట్టమొదటగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ట్రాన్స్ జెండర్ క్లినిక్ మూతపడింది. అంతేకాకుండా మహారాష్ట్రలోని కల్యాణ్, పూణే ప్రాంతాల్లోని మైత్రి క్లినిక్ లు కూడా మూతబడ్డాయి. 2021లో హైదరాబాద్‌లో మొదటగా మిత్ర(Mitr Clinics) ఆస్పత్రిని ప్రారంభించినట్లు సమాచారం. ఈ క్లినిక్‌ల ద్వారా ట్రాన్స్‌జెండర్లకు హార్మోన్ థెరపీపై అవగాహన, మందులు, మానసిక ఆరోగ్యంతో పాటు హెచ్‌ఐవీ, ఇతర లైంగికంగా సంక్రమించే వ్యాధులపై కౌన్సెలింగ్, సాధారణ వైద్య సంరక్షణ, న్యాయసహాయంతో సహా పలు సేవలను అందించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ సేవలు అందించడానికి ప్రతిఒక్కరికీ ఏడాదికి రూ.30 లక్షల వరకు అవుతుందని తెలిపాయి. అయితే, ప్రభుత్వ లేదా ప్రైవేట్ నిధుల ప్రత్యామ్నాయ వనరుల కోసం ఆ క్లినిక్ లో పనిచేసేవారు వెతుకుతున్నట్లు తెలుస్తోంది.
స్పందించిన ఎలాన్ మస్క్
యూఎస్ ఎయిడ్ నిధులు అందకపోవడంతో ఈ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. భారత్‌లోని మూడు ట్రాన్స్‌జెండర్ల క్లినిక్‌లు మూసివేసినట్లు వస్తున్న వార్తలపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk), రిపబ్లికన్ సెనెటర్ జాన్ కెన్నెడీ స్పందించారు. అమెరికా ప్రజలు చెల్లిస్తున్న పన్నుల వల్ల ఏ దేశాలు బాగుపడుతున్నాయో.. ఎవరికి నిధులు వెళ్తున్నాయో ఇప్పటికైనా అర్థం అయ్యిందా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు, అమెరికన్లు చెల్లించిన పన్నుల డబ్బుతో నిధులు సమకూర్చిన అన్ని ప్రాజెక్టులు నిలిపివేసేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. తన "అమెరికా ఫస్ట్" విధానానికి అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి సమీక్ష కోసం అన్ని విదేశీ సహాయాలను 90 రోజుల పాటు నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు.






